సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘సంత’ చిత్రకళా పోటీకి ట్రెమండస్ రెస్పాన్స్.. దర్శకుడు హ్యాపీ!

ABN, Publish Date - Aug 03 , 2026 | 04:01 PM

నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంత’. ఈ మూవీ ప్రమోషన్ నిమిత్తం ఏర్పాటు చేసిన చిత్రకళా పోటీ.. అద్భుతమైన స్పందనను రాబట్టుకుందని దర్శకుడు తెలిపారు.

Santha Movie Promotional Event

నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర (Nellutla Praveen Chandra) కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంత’ (Santha). ‘మట్టి మనుషుల ప్రేమకథ’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై బి.ఎస్.జె నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సురేష్ ఆత్రేయ సహ నిర్మాత. సూర్య భరత్ చంద్ర - శ్రావ్యారావు జంటగా నటించిన ఈ చిత్రంలో కిన్నెర, మధుమణి, ఆలపాటి లక్ష్మీ, ఉదయశ్రీ, స్వపన్ మండల్, ఆర్.ఎస్.నందా, దుర్గేష్, అమరేందర్, జబర్దస్త్ ఫణి ఇతర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి చిత్రకళా పోటీ నిర్వహించారు. ఈ పోటీకి అద్భుతమైన స్పందన రావడంతో దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర సంతోషాన్ని వ్యక్తం చేశారు.


‘మీరు చూసిన వారాంతపు సంత’ అనే కాన్సెప్ట్‌తో నిర్వహించిన పోటీలో వందలాదిమంది చిత్రకళా నిపుణులు పాల్గొన్నారు. వారిలో 50 మంది విజేతలను ఎంపిక చేసి, వారు గీసిన ‘సంత’ చిత్రాలను నెహ్రు ఆర్ట్ గ్యాలరీలో రెండు రోజులపాటు ప్రదర్శించారు. అందులో నుంచి పది మందిని ప్రోత్సాహక బహుమతులకు... ముగ్గురుని ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా ఎంపిక చేసి, నెహ్రు ఆర్ట్ గ్యాలరీలోని ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో షీల్డులు, శాలువాలతో సత్కరించి, నగదు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మల్లేశం, క్రియేటివ్ హార్ట్స్ అధినేత అంజి ఆకొండి, జబర్దస్త్ ఫణి, భోలే శావలి, మౌనశ్రీ మల్లిక్, పసునూరి రవీందర్ వంటి వారంతా అతిథులుగా పాల్గొని.. విజేతలను అభినందించి, నగదు బహుమతులను అందించారు.


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘నేను స్వతహా చిత్రకారుడ్ని కావడంతో.. నా సినిమా కాన్సెప్ట్, టైటిల్‌కి తగ్గట్లుగా చిత్రకళా పోటీ నిర్వహించాలని చేసిన ప్రయత్నానికి ఇంత గొప్ప స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదు. ఎంపిక చేసిన 50 మంది విజేతల చిత్రాలను.. ‘సంత’ సినిమా చివరిలో జత చేసి చూపిస్తాం. అలాగే.. ఈ పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలను ‘సంత’ ఆడియో రిలీజ్ వేడుకలో కూడా ఘనంగా సత్కరిస్తాం. అదే రోజే ‘సంత’ విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

MS Raju: ‘ఒక్కడు’కు మహేష్, ‘వర్షం’కు ప్రభాస్.. మరి ‘అగధ’కు?

‘వారణాసి’.. జక్కన్న ఇచ్చిన మాస్ అప్‌డేట్ ఇదే!

కీర్తి రెడ్డితో విడాకులకు కారణమిదే: సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Aug 03 , 2026 | 04:01 PM