Ravi Teja: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' విజయంపై ధీమా...

ABN , Publish Date - Jan 11 , 2026 | 07:45 PM

సంక్రాంతి కానుకగా జనవరి 13న వస్తున్న సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చిత్ర బృందం సినిమా సక్సెస్ పై ధీమా వ్యక్తం చేసింది.

Bhartha Mahasayulaku Wignapthi Movie

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఇందులో రవితేజ మాట్లాడుతూ, 'మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, నేను కలిసి 13 సినిమాలు చేశాం. మా సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మా హీరోయిన్స్ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు డీవోపీ ప్రసాద్ మూరెళ్ళ. తనతో తొమ్మిది సినిమాలు చేశాను. కొరియోగ్రాఫర్స్ శేఖర్, భాను కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఫైట్ మాస్టర్ పృధ్వీ ఇందులో ఎంటర్ టైనింగ్ గా ఉండే ఫైట్లు కంపోజ్ చేశారు. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ లాగా కనిపిస్తారు. సినిమాని చాలా పాషన్ తో చేశారు. ఇందులో సునీల్ తో మళ్ళీ 'దుబాయ్ శీను' లాంటి ఫన్ చూడబోతున్నారు. సత్య, కిషోర్, మురళీధర్, గెటప్ శీను, సోనీ... అందరు కూడా అద్భుతంగా చేశారు. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సక్సెస్ మీట్ లో తన గురించి మాట్లాడుతాను. మ్యూజిక్ ఇరగదీసాడు. మా డైరెక్టర్ కిషోర్ తిరుమల ప్రమోషన్స్ లో డాన్స్ ఇరగదీశారు' అని అన్నారు.


'మిరపకాయ్' వచ్చినా... 'మిస్టర్ బచ్చన్' వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తి మాస్ మహరాజా రవితేజ అని దర్శకుడు హరీశ్‌ శంకర్ చెప్పాడు. నిర్మాత సుధాకర్ చెరుకూరి తనకెంతో ఇష్టమైన నిర్మాత అని, ఆయన బ్యానర్ లో ఓ సినిమా చేయాలనుకుంటున్నానని హరీశ్‌ అన్నాడు. అలానే తనకు దర్శకుడిగా జన్మ, పునర్జన్మ ఇచ్చింది రవితేజ నేనని, ఆయనతో ఓ బ్లాక్ బస్టర్ తీస్తానని తెలిపాడు. తాను తెరకెక్కించిన 'పవర్' సినిమా టైమ్ లో కిశోర్ తిరుమల రాసిన డైలాగ్స్ చాలా హెల్ప్ అయ్యాయని బాబీ అన్నాడు. రవితేజతో తాను రెండోసారి నటిస్తున్నానని డింపుల్ హయాతి చెప్పాగా, ఆయన లాంటి సూపర్ స్టార్ తో వర్క్ చేయడం హ్యాపీ ఉందని ఆషిక రంగనాథ్‌ అన్నారు. ఈ సినిమా ఓ ఫన్ రైడ్ లాంటిదని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని దర్శకనిర్మాతలు సుధాకర్ చెరకూరి, కిశోర్ తిరుమల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ శివ నిర్వాణ, పవన్ కూడా పాల్గొని సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

Updated Date - Jan 11 , 2026 | 07:45 PM