'అంతా రాములోరు చూస్కుంటారు' అంటున్న సంగీత్ శోభన్
ABN, Publish Date - Sep 06 , 2026 | 03:40 PM
మ్యాడ్ చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యంగ్ హీరో సంగీత్ శోభన్, మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ జంటగా ఒక సినిమా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే.
మ్యాడ్ చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యంగ్ హీరో సంగీత్ శోభన్ (Sangeeth Sobhan), మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ (Anaswara Rajan) జంటగా ఒక సినిమా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. కుమారి 21F, 18 పేజెస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, విజిబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఇక ఈ సినిమాకు అంతా రాములోరు చూస్కుంటారు అనే టైటిల్ ని ఖారారు చేశారు. గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మారుతిగా సంగీత్ కనిపించగా .. శిరీషగా అనస్వర నటిస్తోంది. గోదావరి నది బ్యాక్‌డ్రాప్‌లో పడవపై సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ మధ్య సాగే క్యూట్ సంభాషణలతో గ్లింప్స్ అదిరిపోయింది. అయితే మీట్ మారుతి.. ఇది అతడి ప్రేమకథ కాదు అని చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. సంగీత్ ఎంతో అమాయకంగా కనిపించగా.. అనస్వర అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. చివర్లో నందనవనమే మళ్లీ మెరిసినా.. అంటూ వచ్చే సాంగ్ సినిమా కథను తెలియజేస్తుంది. మొత్తానికి టైటిల్ గ్లింప్స్ తోనే మేకర్స్ సినిమాపై అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో సంగీత్ శోభన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.