సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రియాలిటీ.. ప్రతి సంగీత్ లో ఈ సాంగ్ పక్కా

ABN, Publish Date - Nov 29 , 2026 | 09:48 PM

కుర్ర హీరో కిరణ్ అబ్బవరం నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం రియాలిటీ. జాయ్ ఫిల్మ్స్ ఎల్ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చాగంటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కిరణ్ సరసన దేవిక భట్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన రెండు పాటలు సోషల్ మీడియాని షేక్ చేశాయి.

Kiran Abbavaram

సినిమాల్లో పాటలు అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. ప్రేక్షకులను ఉత్సాహంగా ఉర్రూతలూగించే వేడుకలా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రేషన్ సాంగ్స్‌లో సంగీతం, డ్యాన్స్, లిరిక్స్ అన్నీ కలిస్తే ఆ పాటకు వచ్చే ఆదరణే వేరు. తాజాగా రియాలిటీ సినిమా నుంచి రిలీజైన సంగీత్ సాంగ్ కూడా ఇదే కోవలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం రియాలిటీ (Reality). జాయ్ ఫిల్మ్స్ ఎల్ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చాగంటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కిరణ్ సరసన దేవిక భట్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన రెండు పాటలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. ముఖ్యంగా ఉన్నంతలో మనకున్నంతలో అంటూ సాగే అసలైన రియాలిటీని చూపిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.


ఇక తాజాగా రియాలిటీ నుంచి సంగీత్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు.. ప్యూర్ సంగీత్ వైబ్స్ ని ఇస్తోంది. పెద్దవాళ్ల నుంచి యువత వరకు ప్రతి ఒక్కరూ కలిసి సందడి చేసేలా ఈ పాటను రూపొందించారు. మొదటి నుంచి చివరి వరకు ఫుల్ ఎనర్జీతో సాగుతూ మంచి సెలబ్రేషన్ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ పాటలో ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన ఆకట్టుకుంటోంది. ఆయనకు సంబంధించిన వైరల్ స్టెప్పును పాటలో చూపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అంతేకాకుండా చిరంజీవి పేరుతో వినిపించే చిరులీక్స్ లిరిక్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాటలోని ఈ భాగం ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని అందించేలా ఉంది. చిరంజీవి డ్యాన్స్ స్టైల్‌ను గుర్తుచేసే ఈ స్టెప్పు ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


సురేష్ గంగుల అందించిన లిరిక్స్ కి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ మరింత హైప్ ని తీసుకొచ్చింది. వేదవతి భాగవతుల, కుంచె రఘు, రోహిణి సోరత్, శ్రీ కృష్ణ, సాహితి చాగంటి, నల్గొండ నర్సన్న వంటి గాయనీగాయకులు ఈ పాటను ఆలపించారు. ఇక ఈ పాటలో హీరో కిరణ్ అబ్బవరం డ్యాన్స్ కూడా మరో హైలైట్‌గా నిలిచింది. తనదైన ఎనర్జీతో స్టెప్పులు వేస్తూ పాటకు మరింత జోష్ తీసుకొచ్చాడు. ఆయన డ్యాన్స్‌తో పాటు పాటలో కనిపించే ఇతరుల సందడి కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఒకరిద్దరితో కాకుండా పెద్ద సంఖ్యలో అందరినీ భాగస్వాములను చేస్తూ పాటను తెరకెక్కించిన విధానం బాగుంది.


సాధారణంగా సంగీత్ వేడుకల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఈ పాటలోనూ అదే వాతావరణాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం కనిపిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ డ్యాన్స్‌లో పాల్గొనేలా చిత్రీకరించడం పాటకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. యువతను ఆకట్టుకునే వేగంతో పాటు పెద్దవాళ్లు కూడా ఆస్వాదించేలా సెలబ్రేషన్ మూడ్‌ను అందించారు. ఇకనుంచి పెళ్లిళ్లు, వేడుకల్లో సందడి చేయడానికి ఈ పాట మంచి ఎంపికగా మారేలా కనిపిస్తోంది. ఇకపోతే రియాలిటీ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం.. హీరోగా, డైరెక్టర్ గా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 29 , 2026 | 09:51 PM