హీరోగా నిఖిల్ విజయేంద్ర సింహా! ‘సంగీత్’ నుంచి వచ్చిన తొలిగీతం
ABN , Publish Date - Sep 19 , 2026 | 02:24 PM
పోడ్ కాస్ట్ హోస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ విజయేంద్ర సింహా హీరోగా నటిస్తున్న సినిమా 'సంగీత్'. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
ప్రముఖ డిజిటల్ పర్సనాలిటీ, పోడ్‌కాస్ట్ హోస్ట్‌గా గుర్తింపు పొందిన నిఖిల్ విజయేంద్ర సింహా ‘సంగీత్’తో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఆయనకు జోడీగా తేజు అశ్విని నటిస్తున్నారు. యువతను ఆకట్టుకునే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ‘సంగీత్’ నుంచి తొలి పాట ‘నీ వల్లే’ విడుదలైంది. కథానాయకుడు నిఖిల్ విజయేంద్ర సింహా ఆయన అభిమానులకు, సంగీత ప్రియులకు ‘నీ వల్లే’ ఒక ప్రత్యేకమైన మ్యూజికల్ ట్రీట్‌గా ఇది నిలిచింది. ఈ పాటను తన సామాజిక మాధ్యమం ఖాతా 'ఎక్స్' ద్వారా ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ విడుదల చేశారు. అచు రాజామణి స్వరాలకు విక్రమ్ శివ హృద్యమైన సాహిత్యం అందించగా, సిద్ శ్రీరామ్ దానిని పాడారు. ఈ ‘నీ వల్లే’ పాటలో అచు రాజామణి అందించిన సంగీతం ప్రేమ, భావోద్వేగాలను అద్భుతంగా ప్రతిబింబిస్తోంది. మెలోడీకి తగిన ఆహ్లాదకరమైన ఆర్కెస్ట్రేషన్‌తో పాటను అందంగా ఆయన తీర్చిదిద్దారు. సిద్ శ్రీరామ్ తన విలక్షణమైన గాత్రంతో ఈ పాటకు మరింత భావోద్వేగాన్ని జోడించారు.
నిఖిల్ విజయేంద్ర సింహా, తేజు అశ్విని మధ్య ప్రేమను, వారి కెమిస్ట్రీని పరిచయం చేసేలా ఈ పాటను చిత్రీకరించారు. హృద్యమైన సాహిత్యం, మధురమైన సంగీతం, సిద్ శ్రీరామ్ గాత్రం కలసి ‘నీ వల్లే’ను ఆకట్టుకునే రొమాంటిక్ మెలోడీగా నిలిపాయి. తొలి పాటను విడుదల చేయడం ద్వారా ‘సంగీత్’ మ్యూజికల్ జర్నీకి మేకర్స్ ప్రత్యేకంగా శ్రీకారం చుట్టారు. లహరి ఫిల్మ్స్, ఆర్‌బీ స్టూడియోస్ బ్యానర్లపై జి. మనోహరన్, ఎల్. బాలకృష్ణ సమర్పణలో ‘సంగీత్’ తెరకెక్కుతోంది. దీనికి మాజ్ ఖాన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. కన్నడలో తెరకెక్కిన ‘హంబుల్ పొలిటీషియన్ నోగ్రాజ్’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందిన సాద్ ఖాన్ ‘సంగీత్’కు దర్శకత్వం వహిస్తున్నారు. సాద్ ఖాన్, సిద్ధాంత్ సుందర్ కలిసి ఈ కథను రచించారు.
ఇవి కూడా చదవండి:
ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే.. అందుకు కారణం విజయ్ అన్నే: అట్లీ
ఐదు కాదు.. టాలీవుడ్ సినిమాకు మరో మూడు కావాలి
యాక్షన్, హర్రర్ చిత్రాలకు ఏమాత్రం తేడా లేదు: దర్శకుడు