Romanchakam Trailer: నా అమర కావ్యం.. రాస్తే రామాయణం.. తీస్తే రోమాంచకం
ABN, Publish Date - Aug 25 , 2026 | 09:01 PM
మేమ్ ఫేమస్ చిత్రంతో ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన తాజా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ రోమాంచకం (Romanchakam).
మేమ్ ఫేమస్ చిత్రంతో ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన తాజా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ రోమాంచకం (Romanchakam). స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా అధికారిక ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది.
ట్రైలర్ పరిశీలిస్తే.. నేటితరం యూత్, డేటింగ్ యాప్స్ కాన్సెప్ట్, లవ్-రిలేషన్‌షిప్స్ చుట్టూ కథ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. అన్వేష్.. ఒక డేటింగ్ యాప్ ని నడిపిస్తూ ఉంటాడు. అలా ఆ యాప్ లోనే అతడి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ తరువాత అన్వేష్ లైఫ్ ఎటు పోయింది.. ? అసలు ఈ కుర్రాడు చేసిన పని ఏంటి.. ? ఎందుకు అమ్మాయిని వదిలేయాల్సి వచ్చింది. వీరిద్దరి మధ్య జరిగిన రోమాంచకం ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
టైటిల్ కిందనే.. ప్రేమ.. హాస్యం.. ఉత్కంఠ అని ట్యాగ్ లినే ఇచ్చారు. దానికి తగ్గట్లే ట్రైలర్ ని కట్ చేసిన విధానం ఆకట్టుకుంది. హీరో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ డేటింగ్ కాన్సెప్ట్‌పై వర్క్ చేయడం, ఆ క్రమంలో వచ్చే ప్రేమ, గొడవలు, కామెడీ సీన్స్ నవ్వులు పూయించేలా ఉన్నాయి. కథలో వచ్చే ట్విస్ట్‌లు, ఫ్రెండ్స్ ఇన్వాల్వ్‌మెంట్, పోలీస్ స్టేషన్ డ్రామాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక యూత్‌ను ఆకట్టుకునే సంభాషణలు, ఫ్రెష్ లుక్స్‌తో ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ఈ అమ్మాయిలు మెన్స్ ఆర్ డాగ్స్.. మెన్స్ ఆర్ డాగ్స్ అంటారు కదా.. అదే అమ్మాయిలు రోడ్డుపై కుక్క కనిపిస్తే హౌ క్యూట్ అంటారు.. ఎందుకు అనే డైలాగ్ బాగా పేలింది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ నేమ్ జోడవ్వడంతో రోమాంచకం సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరిఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.