సందీప్ వంగా మనిషే వేరు.. 'స్పిరిట్' లెక్కలే సూపరు!
ABN, Publish Date - Apr 20 , 2026 | 05:52 PM
సాధారణంగా ఏ సినిమా అయినా షూటింగ్ దశలో ఉన్నప్పుడే బిజినెస్ క్లోజ్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తారు. కానీ స్పిరిట్ విషయంలో సీన్ రివర్స్‌లో ఉంది.
బాహుబలి సిరీస్‌తో బాక్సాఫీస్ వద్ద కొత్త లెక్కలు క్రియేట్ చేసిన ప్రభాస్ (Prabhas), ఇప్పుడు మళ్లీ అలాంటి కంబ్యాక్‌నే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ (Spirit) చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్‌లో సాధారణంగా ఏ సినిమా అయినా షూటింగ్ దశలో ఉన్నప్పుడే బిజినెస్ క్లోజ్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తారు. కానీ స్పిరిట్ విషయంలో సీన్ రివర్స్‌లో ఉంది.
ఈ ఏడాది సమ్మర్ బాక్సాఫీస్ సందడి అంతంతమాత్రంగానే ఉన్నా, 2027 వేసవి మాత్రం స్పిరిట్ సునామీతో మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో మహేష్‌బాబు ( Mahesh Babu) వారణాసి (Varanasi) కూడా బరిలో ఉండటంతో నెక్ట్స్ సమ్మర్ వార్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే సందీప్ వంగా ఇక్కడ కేవలం దర్శకుడిగానే కాకుండా, ఒక పక్కా బిజినెస్ మేన్‌లా పావులు కదుపుతున్నారు. రాజమౌళి (S. S. Rajamouli) తర్వాత ప్రమోషన్స్‌లో తనదైన ముద్ర వేయగల సత్తా ఉన్న వంగా, ఇప్పుడు స్పిరిట్ సినిమా చుట్టూ అంతకు మించిన హైప్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు.
సందీప్ రెడ్డి వంగా సినిమా తీసే విధానం ఎంత భిన్నంగా ఉంటుందో, సినిమాను అమ్మే విధానం కూడా అంతే స్పెషల్‌గా ఉంటుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు స్పిరిట్ కోసం తన సొంత బ్యానర్‌లోనే భారీ డీల్స్ సెట్ చేస్తున్నారు. సాధారణంగా క్రేజీ ప్రాజెక్టులకు ఓటిటి సంస్థల నుంచి వందల కోట్ల ఆఫర్లు రావడం సహజం. స్పిరిట్‌కు కూడా ఇప్పటికే కళ్ళు చెదిరే ఆఫర్లు వచ్చినప్పటికీ, సందీప్ ఏమాత్రం తొందరపడటం లేదు.
సినిమా షూటింగ్ పూర్తయి, టీజర్ రిలీజ్ అయ్యాక వచ్చే బజ్ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్తుందని ఆయన నమ్మకం. ముందే డీల్స్ క్లోజ్ చేసుకుని లాభాలను పరిమితం చేసుకోవడం కంటే, పీక్ స్టేజ్‌లో మార్కెట్ చేయడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు. కొత్త దర్శకులకు సైతం సవాల్ విసిరేలా తన సినిమా బిజినెస్ వాల్యూను తనే డిసైడ్ చేస్తున్నారాయన. మరోవైపు డార్లింగ్ ప్రభాస్ కూడా ఈ ఏడాది రాజా సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ, ఫ్యాన్స్ అసలు ఆకలి మాత్రం స్పిరిట్ మీదనే ఉంది.
ప్రభాస్‌ను ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, అదీ సందీప్ వంగా మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ స్టార్‌డమ్ కూడా తోడవడంతో, బిజినెస్ పరంగా సందీప్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సినిమా విడుదలకు ముందు వచ్చే హైప్‌ను చూసి బిజినెస్ చేసే కంటే, సినిమా కంటెంట్‌పై ఉన్న ధీమాతో చివరి నిమిషం వరకు వేచి చూసే సందీప్ స్ట్రాటజీ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. మొత్తానికి 2027 సమ్మర్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త చరిత్రకు వేదిక కాబోతోంది.