సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'సంచారి' టైటిల్ వివాదం.. చంద్ర సిద్ధార్థ టైటిల్‌తో తమిళ్ డబ్బింగ్

ABN, Publish Date - Sep 26 , 2026 | 04:57 PM

ప్రస్తుతం టాలీవుడ్‌లో 'సంచారి' టైటిల్ చుట్టూ ఆసక్తికర వివాదం చెలరేగింది. యువ మలయాళ కథానాయకుడు నివిన్ పౌలీ, తమిళ నటుడు సూరి, తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ 'యెళు కాదల్ యెళు మలై'.

ప్రస్తుతం టాలీవుడ్‌లో 'సంచారి' టైటిల్ చుట్టూ ఆసక్తికర వివాదం చెలరేగింది. యువ మలయాళ కథానాయకుడు నివిన్ పౌలీ, తమిళ నటుడు సూరి, తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ 'యెళు కాదల్ యెళు మలై'. తెలుగులో 'సంచారి' పేరుతో డబ్ చేసి, అక్టోబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఆల్రెడీ తెలుగు దర్శకుడు చంద్ర సిద్ధార్థ రిజిస్టర్ చేయించిన టైటిల్‌ను ఆయన అనుమతి లేకుండా అనౌన్స్ చేయడంతో ఫిల్మోత్సవ్ బ్యానర్ ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఈ టైటిల్ కాంట్రవర్సీ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మానవ సంబంధాలకు పెద్ద పీట వేస్తూ... తెలుగు ప్రేక్షకులకు 'ఆ నలుగురు', 'మధుమాసం', 'అందరి బంధువయా', 'ఆటగదరా శివా' వంటి భావోద్వేగభరిత సినిమాలను అందించిన విలక్షణ దర్శకుడు చంద్ర సిద్ధార్థ. ఫిల్మోత్సవ్ పతాకంపై 'సంచారి' టైటిల్‌ను కొన్ని నెలల ముందే రిజిస్టర్ చేయించుకున్నారు. తాను తీయబోయే కొత్త సినిమా కోసం ఆ టైటిల్ హక్కులు తీసుకున్నారు. తమ బ్యానర్ రిజిస్టర్ చేయించిన టైటిల్‌ను డబ్బింగ్ సినిమా వాళ్ళు అనౌన్స్ చేయడంతో షాక్ తిన్నారు. ఈ అంశంపై ఛాంబర్ పెద్దలను ఆశ్రయించి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఆసక్తి రేకెత్తిస్తున్న చంద్ర సిద్ధార్థ 'సంచారి' స్టోరీ లైన్!

గుండెపోటుకు గురైన ఓ ఈ కామర్స్ కుబేరుడు, తనకు కొన్ని నెలల ఆయుష్షు మాత్రమే ఉందని తెలుసుకుంటాడు. దాంతో తన కుటుంబానికి దూరంగా వెళ్లి 'సంచారి' పేరుతో రాయలసీమలో అడుగు పెడతాడు. అక్కడ ఐదుగురు అపరిచితులకు సాయం చేసే క్రమంలో... వారి జీవితాల్లో ఎదురైన విషాదాలన్నీ తన సొంత సంస్థ తీసుకున్న నిర్ణయాల వల్ల ఏర్పడ్డాయని గ్రహిస్తాడు. ఆ తర్వాత ఏమైందనేది సినిమా.

చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించబోయే తమ సినిమా కథకు 'సంచారి' టైటిల్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందని ఫిల్మోత్సవ్ సంస్థ చెబుతోంది. మరి ఆ టైటిల్ అనౌన్స్ చేసే ముందు తమిళ్ డబ్బింగ్ సినిమా టీమ్, ఇక్కడ ఛాంబర్ లేదా ఫిల్మ్ బాడీలను సంప్రదించిందా? లేదా? ఒకవేళ ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకుని చెబితే టైటిల్ మారుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Updated Date - Sep 26 , 2026 | 05:22 PM