‘సంబరాల ఏటిగట్టు’లో అర్జున్‌గా డాలీ ధనంజయ్.. స్పెషల్ పోస్టర్ విడుదల!

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:41 PM

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ భారీ పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. తాజాగా ఈ మూవీ నుంచి న్యూ అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.

SYG Update

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ భారీ పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ (SYG). ‘హను-మాన్’ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామా షూటింగ్ మొత్తం విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘అసుర ఆగమన’ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. తాజాగా ఈ మూవీ (Sambarala Yeti Gattu) నుంచి న్యూ అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.


ఈ సినిమాలో బహుముఖ ప్రజ్ఞాశాలి, విలక్షణ నటుడు డాలీ ధనంజయ్ (Dolly Dhananjay) అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ధనంజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, చిత్రంలో ఆయన పోషిస్తున్న ‘అర్జున్’ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ అదిరిపోయే స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ధనంజయ్ తెల్లటి కుర్తా ధరించి, కళ్లలో తీవ్రమైన భావోద్వేగం, సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌తో ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. కథాగమనంలో ఆయన పాత్ర అత్యంత ప్రభావవంతంగా, కీలక మలుపులకు కారణమయ్యేలా ఉండబోతోందని ఈ పోస్టర్ చూస్తేనే స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ భారీ చిత్రంలో సాయి దుర్గ తేజ్ మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ అవతారంలో కనిపించనున్నారు. ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా నటిస్తుండగా.. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ళతో పాటు ఓ అగ్రశ్రేణి బాలీవుడ్ స్టార్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వెట్రివేల్ పళనిస్వామి సినిమాటోగ్రఫీ, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, నవీన్ విజయ్ కృష్ణ ఎడిటింగ్, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైన్ సమకూరుస్తున్నారు. పీటర్ హెయిన్స్, రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో తెరకెక్కించిన యాక్షన్ ఘట్టాలు విజువల్ వండర్‌గా, ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12న ‘సంబరాల ఏటిగట్టు’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

వరుసగా 200 కోట్ల క్లబ్‌లోకి సూర్య.. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ పోస్టర్ వైరల్

T-Rex అంటే అర్థమిదేనా శ్రీకాంత్ ఓదెల?.. చిరుని ఏం పోల్చావయ్యా

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం

Updated Date - Aug 23 , 2026 | 11:41 PM