ఎట్టకేలకు ‘సంబరాల ఏటిగట్టు’ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే
ABN , Publish Date - Jun 27 , 2026 | 10:10 PM
మెగా హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్-ఇండియా చిత్రం ‘SYG’ (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.
మెగా హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) హీరోగా నటిస్తోన్న పాన్-ఇండియా చిత్రం ‘SYG’ (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ (Rohith KP) దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ‘అసుర ఆగమన’ గ్లింప్స్, ఇంకా ఇతర ప్రమోషనల్ కంటెంట్ భారీ స్పందనను రాబట్టుకుని, సినిమాపై హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. కాకపోతే కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రావడం లేదు. అసలు విడుదల ఎప్పుడనేది కూడా మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోవడంతో పాటు, మధ్యలో వినిపించిన రూమర్స్‌తో.. అసలు ఈ సినిమా ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అటువంటి అనుమానాలకు తెరదించుతూ.. తాజాగా మేకర్స్ ఈ చిత్ర అప్డేట్‌ని తెలియజేశారు.
నిర్మాణంలో చివరి, అత్యంత కీలకమైన దశకు చేరిందని తెలుపుతూ.. ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yeti Gattu) చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ చిత్రీకరణను ప్రారంభించుకున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ షెడ్యూల్‌లో అద్భుతమైన యాక్షన్-ప్యాక్డ్ సన్నివేశాలకు జీవం పోయడానికి, ప్రత్యేకంగా ఒక భారీ సెట్‌ను గ్రాండ్‌గా నిర్మించారు. ఈ చివరి షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొనే కీలకమైన ఘట్టాలు ఉంటాయని, ఇది ఒక మరపురాని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయని మేకర్స్ తెలిపారు.
సాయి దుర్గ తేజ్ తన కెరీర్‌లోనే అత్యంత పవర్ ఫుల్, ఇంటెన్స్ పాత్రలలో కనిపించబోతున్న ఈ చిత్రంలో టాప్ బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తుండగా.. ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ళ ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే పోస్ట్-ప్రొడక్షన్ పనులు ప్రారంభమవుతాయని, చిత్రాన్ని 2026 డిసెంబర్‌లో గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటిస్తామని ఈ అప్డేట్‌లో నిర్మాతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
‘నాగబంధం’ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్స్ వివరాలివే!
Kamal Haasan: ఒకే నెలలో గురు శిష్యుల మరణం.. తమిళ పరిశ్రమ కన్నీరుమున్నీరు..
Naga Chaitanya: నా కెరీర్‌లో బెస్ట్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆ హీరోయిన్‌తోనే