సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బంగారం.. తస్సాదియ్యా వీడియో సాంగ్ భలే ఉందిలే

ABN, Publish Date - Jul 03 , 2026 | 07:53 PM

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన సినిమా మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram). నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రాజ్ నిడిమోరు నిర్మించాడు.

Maa Inti Bangaaram

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన సినిమా మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram). నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రాజ్ నిడిమోరు నిర్మించాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య మా ఇంటి బంగారం జూన్ 19 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ సినిమా రూ. 92 కోట్లు కొల్లగొట్టడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఈ రికార్డును అనుష్క కూడా దాటలేదు. దీంతో సామ్.. టాలీవుడ్ కి లేడి సూపర్ స్టార్ గా మారింది. సామ్ యాక్షన్, ఫైట్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేయడానికి మా ఇంటి బంగారం నుంచి తస్సాదియ్యా వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.


మా ఇంటి బంగారం సినిమాలో తస్సాదియ్యా సాంగ్ హైలైట్ గా నిలిచింది. ఈ క్రేజీ సాంగ్‌కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అద్భుతమైన ఎనర్జిటిక్ ట్యూన్స్ అందించగా, సమంత పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ సాంగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. సమంతకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద, పుణ్యతో కలిసి ఈ పాటను ఎంతో ఎనర్జిటిక్‌గా ఆలపించారు. ఇక ఈ వీడియో సాంగ్‌లో సమంత తన మార్క్ గ్రేస్, పవర్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సరికొత్త ఎనర్జీని చూపించడమే కాకుండా, తెలుగింటి ఆడపడుచుగా కనిపించి మెప్పించింది.


ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులను జియో స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. జులై చివరివారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కొన్ని సినిమాలు థియేటర్ లో హిట్ టాక్ తెచ్చుకున్నా.. ఓటీటీలో మాత్రం ప్లాప్ అందుకుంటాయి. మరి మా ఇంటి బంగారం.. ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Jul 03 , 2026 | 08:20 PM