సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Maa Inti Bangaram Trailer: కొత్త కోడలి విశ్వరూపం.. అదిరిపోయింది బంగారం

ABN, Publish Date - May 25 , 2026 | 09:33 PM

స్టార్ హీరోయిన్ సమంత ( Samantha) నటించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram). రాజ్ నిడిమోరుతో పెళ్ళి తరువాత సామ్ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలనే పెట్టుకున్నారు.

Maa Inti Bangaram

స్టార్ హీరోయిన్ సమంత ( Samantha) నటించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram). రాజ్ నిడిమోరుతో పెళ్ళి తరువాత సామ్ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఓ బేబీ లాంటి హిట్ సినిమా తరువాత సమంత - నందినిరెడ్డి కాంబోలో వస్తోన్న చిత్రం మా ఇంటి బంగారం. ఈ సినిమాను ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక ఎన్నో వాయిదాల తరువాత బంగారం జూన్ 19 న రిలీజ్ కి సిద్ధమైంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ తాజాగా మా ఇంటి బంగారం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. గతాన్ని దాచి.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఒక అమ్మాయి జీవితం ఎటు మలుపు తిరిగింది అనే లైన్ తో మా ఇంటి బంగారం సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.


ప్రేమించి పెళ్ళి చేసుకున్న హీరోయిన్.. దాదాపు రెండేళ్ళ తరువాత అత్తవారింట్లో అడుగుపెడుతుంది. ఆమెకు కోడలిగా ఉండే ఏ లక్షణం లేదని, చిన్న కోడలు అనసూయను చూసి నేర్చుకోమని పోరు పెడుతుంటారు. అయినా అన్నింటిని భరించిన హీరోయిన్.. తన అత్తవారింటికి కష్టం వస్తే ఎదురు నిలబడుతుంది. ప్రాణం పెట్టి మరీ వారిని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతలో తన గతం మొత్తం తెలిసిన వ్యక్తి ఆమె జీవితంలోకి వస్తాడు. మరి ఆ గతాన్ని.. అత్తవారింట్లో తెలియకుండా హీరోయిన్ ఏం చేసింది.. ? ఆస ఆ గతంలో హీరోయిన్ ఏంటి.. ? ఆమె చుట్టూ తిరుగుతున్న విలన్స్ ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


సాధారణంగా అత్తవారిల్లు అంటేనే అందరికీ భయం. అలాంటిది తనంటే ఇష్టం లేని ఇంటికి కోడలిగా వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించినట్లు తెలుస్తోంది. సామ్.. కోడలిగా కనిపిస్తూనే.. గన్ పట్టి కాలుస్తుంటే చూడడానికి వేరే లెవెల్ లో ఉందని చెప్పొచ్చు. అమ్మడి యాక్షన్ సీన్స్ అయితే అబ్బబ్బా.. విశ్వరూపం చూపించిందని అంటున్నారు. చీరలోనే ఫైట్స్ చేస్తుంటే.. అదిరిపోయింది. ఇక శ్రీముఖి.. సామ్ తోడికోడలిగా కనిపించింది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ అంచనాలు ఇంకా పెంచేలా ప్రమోషన్స్ కూడా చేస్తే బంగారం థియేటర్ లో బ్లాస్ట్ అవుతుంది.. మరి సామ్ బంగారం హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Updated Date - May 25 , 2026 | 09:58 PM