సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Maa Inti Bangaram: వెనక్కి తగ్గిన సమంత!

ABN, Publish Date - Apr 30 , 2026 | 07:57 AM

సమంత నటించి, నిర్మించిన 'మా ఇంటి బంగారం' సినిమా వాయిదా పడినట్టు తెలుస్తోంది. జూన్‌ 4న రావాల్సిన 'టాక్సిక్‌' మరోసారి వాయిదా పడటంతో ఆ డేట్‌కు 'మా ఇంటి బంగారం' వస్తుందని అంటున్నారు.

Maa Inti Bnagaaram

సమంత (Samantha) హీరోయిన్‌గా నటించి, నిర్మించిన 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) సినిమా విడుదల వాయిదా పడింది. మే 15న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఇప్పుడు జూన్‌ 4వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే జూన్‌ 4న రావాల్సిన పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్‌' మరోసారి వాయిదా పడింది. దాంతో ఆ స్లాట్‌లో తమ చిత్రాన్ని విడుదల చేద్దామని సమంత బృందం నిర్ణయించుకుందని అంటున్నారు.


మే నెలలో ఐపీఎల్‌ ఫీవర్‌ పీక్స్ కు చేరుతుంది. ప్రస్తుతం టీ 20కి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఆ సమయంలో జనాలు సినిమాలపైన పెద్దంత దృష్టి పెట్టరు కాబట్టి... 'మా ఇంటి బంగారం'ను వాయిదా వేయమని పంపిణీదారులు కోరినట్టు తెలుస్తోంది. సమంత నాయికగా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, దింగత్‌ మన్‌చలే, గౌతమి, శ్రీముఖి, శ్రీలక్ష్మి, అంజలి, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్‌ నారాయణన్‌ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు సమంత భర్త రాజ్‌ నిడిమోరు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడంతో పాటు వసంత్‌ మరిన్‌గంటి, సీతామీనన్‌తో కలిసి ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు.

Updated Date - Apr 30 , 2026 | 08:05 AM