సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సమంత భర్త.. టాలీవుడ్ ఎంట్రీ ..?

ABN, Publish Date - Jun 26 , 2026 | 09:14 PM

రాజ్ నిడిమోరు (Raj Nidimoru).. ఒకప్పుడు ఈ పేరు చాలా తక్కువమందికే తెలుసు. బాలీవుడ్ లో ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన రాజ్- డీకే ద్వయం అని మాత్రమే తెలుసు.

Raj Samantha

రాజ్ నిడిమోరు (Raj Nidimoru).. ఒకప్పుడు ఈ పేరు చాలా తక్కువమందికే తెలుసు. బాలీవుడ్ లో ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన రాజ్- డీకే ద్వయం అని మాత్రమే తెలుసు. కానీ, ఎప్పుడైతే రాజ్- సమంత (Samantha) రిలేషన్ లో ఉన్నారు అని తెల్సిందో.. ఆయన పేరు సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక సమంతతో పెళ్లి అయ్యాక రాజ్ ఇక్కడివాడిగా మారిపోయాడు. అందులో రాజ్ కుటుంబ నేపధ్యం తెలుగు అని తెలిశాక మరింతగా ఆయనను ఆదరించడం మొదలుపెట్టారు. ఇక ఈమధ్యనే సమంత నటించిన మా ఇంటి బంగారం మంచి విజయాన్ని అందుకుంది. ఈ విజయం వెనుక ఉన్నది కూడా రాజ్ నే. ఆ విషయాన్ని సామ్ నే స్వయంగా చెప్పింది.


రాజ్.. మంచి డైరెక్టర్.. అందులోనూ తెలుగువాడు. ఎప్పుడూ బాలీవుడ్ లోనే ఉండిపోతాడా అంటే.. లేదు అందుతున్న సమాచారం ప్రకారం రాజ్ నిడిమోరు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా తెలుగు సినిమానే కనిపిస్తోంది. గ్లోబల్ స్థాయిలో పాన్ ఇండియా మార్కెట్‌ను శాసిస్తున్న టాలీవుడ్ ని చూసి మిగతా ఇండస్ట్రీవారు ఎప్పుడెప్పుడు ఇక్కడకి రావాలా అని ఎదురుచూస్తున్నారు. సామ్ తో పెళ్లి.. రాజ్ కి కలిసివచ్చింది. సామ్ పెళ్లి కాకముందు రాజ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ఉంటే వచ్చే ఇంపాక్ట్ కన్నా.. సామ్ భర్తగా ఆయన అడుగుపెట్టేటప్పుడు వచ్చే ఇంపాక్ట్ చాలా ఎక్కువ. అందుకే టాలీవుడ్ హీరోలను దృష్టిలో పెట్టుకొని రాజ్ కథలను సిద్దం చేస్తున్నాడట.


స్టార్ హీరోల మాస్ ఇమేజ్‌కు సరిపోయేలా, విభిన్నమైన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ప్రత్యేకమైన సబ్జెక్టులను ఆయన సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది.గతంలోనూ కొన్ని సినిమాల‌కు రాజ్ నిడిమోరు కథలు అందించాడు. కానీ, ఇప్పుడు ఓటీటీ కాకుండా వెండితెరపై వెలగాలని చూస్తున్నాడట. త్వరలోనే ఒక మంచి కథను సిద్ధం చేసి స్టార్ హీరోలను అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే తెలుగులో రాజ్ ఒక్కడే అడుగుపెడతాడా.. ? డీకే కూడా కలుస్తాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. మరి సామ్ భర్త టాలీవుడ్ కి ఏ రేంజ్ లో ఎంట్రీ ఇస్తాడో.. ఏ హీరోతో ఎంట్రీ ఇస్తాడో చూడాలి.

Updated Date - Jun 26 , 2026 | 09:14 PM