Samantha: సమంత విషయంలో ఆ జోస్యం నిజమైంది
ABN, Publish Date - Nov 21 , 2026 | 12:02 PM
సినీ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంటుంది. గతంలో చేసిన వ్యాఖ్యలు, అంచనాలు అప్పుడప్పుడు నిజం కావడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తుంటాయి.
సినీ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంటుంది. గతంలో చేసిన వ్యాఖ్యలు, అంచనాలు అప్పుడప్పుడు నిజం కావడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా నటి సమంత (Samantha) విషయంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆమెకు మగబిడ్డ పుడతాడంటూ దాదాపు 12 ఏళ్ల క్రితం ఓ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇటీవల సంగీత దర్శకుడు అనిరుధ్ పెళ్లి విషయానికి సంబంధించి జ్యోతిష్యం చెప్పిన ఓ పాత వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆయన వివాహం చేసుకుంటారని జ్యోతిష్యుడు చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది. ఇప్పుడు సమంత విషయంలోనూ ఇలాంటి పాత వీడియో బయటకు రావడంతో టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
సుమారు 12 ఏళ్ల క్రితం యాంకర్ ప్రదీప్ నిర్వహించిన ఓ చాట్ షోకు సమంత హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఓ జ్యోతిష్యుడితో ఆమె జాతకాన్ని పరిశీలింపజేశారు. ఈ సందర్భంగా సమంతకు తొలి కాన్పులో మగబిడ్డ పుడతాడని ఆయన అంచనా వేశారు. అయితే ఆ మాట విన్న సమంత సరదాగా బుంగమూతి పెట్టి, తనకు అమ్మాయి కావాలని చమత్కరించారు. అప్పట్లో సరదాగా సాగిన ఈ సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో.. 12 ఏళ్ల క్రితం జ్యోతిష్యుడు చెప్పిన మాట ఇప్పుడు నిజమైందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
తన కుమారుడికి పేరు పెట్టే విషయంలోనూ ముందుగానే నిర్ణయం తీసుకున్నట్లు సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆడపిల్ల పుడితే ఒక పేరు, మగబిడ్డ పుడితే మరో పేరు పెట్టాలని ముందే అనుకున్నారట. డెలివరీకి నెల రోజుల ముందే ఈ విషయంలో స్పష్టతకు వచ్చామని ఆమె చెప్పారు. ఈ క్రమంలోనే తన కుమారుడికి 'దేవ్ నిడిమోరు' అని పేరు పెట్టినట్లు సమంత ప్రకటించారు.