Samantha: పేరు మార్చుకోనున్న సమంత.. కారణం ఏంటి
ABN, Publish Date - Jan 30 , 2026 | 04:54 PM
సాధారణంగా పెళ్లి తరువాత ఆడవారికి ఇంటి పేరు మారుతోంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. కానీ, కొంతమంది స్టార్స్, బిజినెస్ విమెన్స్ పెళ్లి తరువాత భర్త ఇంటి పేరును మార్చుకోవడానికి ఇష్టపడరు.
Samantha: సాధారణంగా పెళ్లి తరువాత ఆడవారికి ఇంటి పేరు మారుతోంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. కానీ, కొంతమంది స్టార్స్, బిజినెస్ విమెన్స్ పెళ్లి తరువాత భర్త ఇంటి పేరును మార్చుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా హీరోయిన్స్ తమ ఇంటిపేరు పక్కన భర్త ఇంటిపేరును పెట్టుకుంటారు. మరికొంతమంది తన పేరు పక్కన భర్త ఇంటిపేరును యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు సమంత (Samantha) కూడా అదే పని చేస్తోందని టాక్ నడుస్తోంది. సమంత రూత్ ప్రభు.. గతేడాది చివర్లో రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను వివాహాం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పెళ్లి తరువాత సామ్ లో చాలా మార్పులు వచ్చాయి. మునుపెన్నడూ లేని మెరుపు, సంతోషం సామ్ ముఖంలో కనిపిస్తుంది.
ఇక సమంత పెళ్లి తరువాత ఒక కొత్త నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. పెళ్లి తరువాత సమంత.. తన భర్త ఇంటిపేరును తన పేరు చివరన జోడించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ కార్డ్స్ లో సమంత నిడిమోరుగా పేరు మార్చుకున్నట్లు సమాచారం. మరికొద్దిరోజుల్లో సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా సమంత నిడిమోరు అనే ఉండబోతుందట.
సమంత మొదట అక్కినేని నాగ చైతన్యను వివాహమాడినప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనే ఆమె సమంత అక్కినేనిగా పేరు మార్చుకుంది. కానీ, సినిమా టైటిల్ కార్డ్స్ లో ఎప్పుడు సమంత లేక సమంత రూత్ ప్రభు అనే కనిపించేవి. కానీ, ఈసారి మాత్రం సామ్.. తన భర్త ఇంటిపేరును జోడించి పెట్టుకోవడం మంచి విషయమని నెటిజన్స్ అంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. పెళ్లి తరువాత సామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరి చూపు దీనిపైనే ఉంది. మరి సమంత నిడిమోరు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.