చేనేత చీరలో అదిరిపోయిన సమంత అందం
ABN, Publish Date - Mar 19 , 2026 | 06:26 PM
అమ్మో.. బాపుగారి బొమ్మో.. అని పాడుకుంటున్నారు ఆ బ్యూటీని చూసి. చీరకట్టులో ముద్దుగుమ్మ అందాన్ని చూసి పొగడకుండా ఉండలేక పోతున్నారు. అందుకే తమ అభిమానాన్ని, లైక్స్ , షేర్ల రూపంలో పంచుకుంటున్నారు. ఇంతకీ ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా!?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నయా లుక్ లో అదరగొట్టింది. చేనేత చీరలో అచ్చం బాపు బొమ్మలా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. అటు గ్లామర్, ఇటు ట్రెడిషన్ కలబోసిన రూపంలో దర్శనమిచ్చి మెస్మరైజ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సామ్ ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
తాజాగా సామ్ చేసిన ఈ ఫోటో షూట్ రాబోయే సినిమా 'మా ఇంటి బంగారం' (Maa inti bangaram) ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చింది. 'ద బాపు బొమ్మ' సిరీస్ పేరుతో ఈ ఫోటోలను షూట్ చేశారు. బాపు గారి చిత్రాల్లోని నాయికల్లా సుకుమారత్వం, హుందాతనం, సరళతను శక్తివంతంగా చూపించిన ఈ లుక్‌కు సమంత అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చింది . మెత్తదనాన్ని శక్తివంతంగా, సరళతను మరపురానిదిగా మార్చిన కళాకారుడికి అంకితం అని చెప్పుకొచ్చింది. సాధారణంగా సమంత శారీలో ఎప్పుడూ తనదైన ముద్ర వేస్తుంది. సింపుల్‌గా కనిపించే చీరలోనూ లగ్జరీ, ఎలిగెన్స్‌ను తీసుకొచ్చే బ్యూటీ స్టైల్ టాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచిపోతోంది. తాజాగా భారతీయ సంప్రదాయాన్ని ఆధునిక టచ్‌తో మిక్స్ చేసి, చేనేత వస్త్రాల పట్ల తన ప్రేమను మరోసారి చాటుకుంది సమంత. మొత్తానికి ఈ 'బాపు బొమ్మ సిరీస్'తో సామ్ మళ్లీ ట్రెండ్‌సెట్టర్ అయింది.