9 నెలల కడుపుతో సమంత.. ఇదే చివరిదేమో
ABN, Publish Date - Nov 09 , 2026 | 07:00 PM
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మరి కొద్దిరోజుల్లో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతుందని తెలుస్తోంది. మా ఇంటి బంగారం సినిమా సమయంలోనే సామ్.. తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన విషయం తెల్సిందే.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మరి కొద్దిరోజుల్లో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతుందని తెలుస్తోంది. మా ఇంటి బంగారం సినిమా సమయంలోనే సామ్.. తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన విషయం తెల్సిందే. గతేడాదిలో రాజ్ నిడిమోరుని వివాహమాడిన సామ్.. ఇప్పుడు తల్లిగా ప్రమోట్ అయ్యే సమయం దగ్గరపడినట్లు చెప్పుకొచ్చింది. ప్రెగ్నెంట్ అయినా కూడా అమ్మడు ఒకపక్క షోస్.. ఇంకోపక్క వర్క్అవుట్స్ చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తూనే ఉంది. ఇక ఆమె పెళ్లి ఎంత నిరాడంబరంగా జరిగిందో ఆమె సీమంతం కూడా అంతే సింపుల్ గా జరిగింది. ఇక ఈ నెలతో సామ్ 9 నెలలోకి అడుగుపెట్టింది.
సాధారణంగా సెలబ్రిటీలు, కాబోయే తల్లులు గర్భధారణ సమయంలో ప్రత్యేకంగా ఖర్చు పెట్టి, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లతో గ్రాండ్‌గా మెటర్నిటీ ఫోటోషూట్ చేయించుకుంటూ ఉంటారు. కాజల్, దీపికా, రాధిక ఆప్టే, అలియా భట్.. ఇలా స్టార్ హీరోయిన్స్ అందరూ.. తమ కడుపు కనిపించేలా డిజైనర్ డ్రెస్ లతో ఫోటోఘాట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ, ఇక్కడ కూడా సామ్.. తన సింప్లిసిటీని చూపించింది. వైట్ కలర్ వైడ్-లెగ్ ప్యాంట్, క్రాప్ టాప్, ఎరుపు రంగు డిజైనర్ షాల్ ధరించి, బ్లాక్ సన్ గ్లాసెస్‌తో సోఫాలో విశ్రాంతి తీసుకుంటున్న తన బేబీ బంప్‌ను ఫ్లాంట్ చేస్తున్న ఫోటోను షేర్ చేసి.. 'ఇదే నా మెటర్నిటీ ఫొటోషూట్ అనుకోండి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పిక్‌ను సమంత పంచుకున్న క్షణం నుంచే ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
గతంలో కఠినమైన వర్కవుట్స్‌తో సిక్స్ ప్యాక్ అబ్స్ సాధించిన సమంత, ఇప్పుడు మాతృత్వానికి స్వాగతం పలుకుతూ చేసిన ఈ వ్యాఖ్యలపై అభిమానులు ,సినీ ప్రముఖులు లవ్ ఎమోజీలతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటోలో సమంత ఫ్యాషన్ సెన్స్, రిలాక్స్డ్ మూడ్, ముఖంలో కనిపిస్తున్న ప్రెగ్నెన్సీ గ్లో చూసి ఆమె ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. నిజం చెప్పాలంటే బేబీ బంప్ తో సామ్ కనిపించే చివరి ఫోటో ఇదే కావచ్చని.. మరికొన్ని రోజుల్లో సామ్ చేతిలో బుజ్జి పాప కానీ, బుజ్జి బాబు కానీ ఉంటాడని తెలుపుతూ అభిమానులు చిన్నారికి ముందస్తు ఆశీస్సులు అందిస్తూ.. సమంత హెల్త్, క్యూట్ పోస్ట్‌పై తమ ప్రేమను కామెంట్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. మరి సామ్ ఎవరికి జన్మనిస్తుందో చూడాలి.