సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నా జీవితం మారబోతోంది.. సమంత సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Sep 09 , 2026 | 09:57 PM

సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్-ఇండియా వ్యాప్తంగా ఆడియన్స్‌ను అలరిస్తున్న స్టార్ నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన మాతృత్వపు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుంది.

Samantha

సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్-ఇండియా వ్యాప్తంగా ఆడియన్స్‌ను అలరిస్తున్న స్టార్ నటి సమంత(Samantha) ప్రస్తుతం తన మాతృత్వపు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుంది. రాజ్ నిడిమోరు (Raj Nidimoru) ని వివాహమాడిన సామ్.. ప్రస్తుతం గర్బవతిగా ఉన్న విషయం తెల్సిందే. త్వరలోనే తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత కొన్నిరోజులుగా మాతృత్వం గురించి ఎన్నో విషయాలను చెప్తూ వస్తుంది. ఈ బిడ్డ కోసం టను ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని, తన జీవితం మొత్తం ఆ బిడ్డ కోసమే బతుకుతాను అని చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి తన బిడ్డ రాకతో తన జీవితం మారబోతుందని తెలిపింది.


తాజాగా సామ్ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా సెప్టెంబర్ 2026 మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత, ఈ మ్యాగజైన్ కవర్ పిక్ కోసం ఆఫ్-షోల్డర్ వైట్ రఫుల్డ్ గౌను, సాఫ్ట్ వేవ్స్, ఎలిగెంట్ పెర్ల్ ఇయర్ రింగ్స్‌తో అత్యంత కాంతివంతంగా, రాయల్ లుక్‌లో కనిపించింది. అదొక్కటే కాకుండా మెజెంటా కటౌట్ గౌన్, పింక్ తుల్లే డ్రెస్, రెడ్ ఎన్‌సెంబుల్ వంటి డిఫరెంట్ అండ్ బోల్డ్ అవుట్‌ఫిట్స్‌లో డిజైన్ చేసిన ఆమె పిక్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


ఇక మాతృత్వం గురించి, మహిళల గురించి సామ్ మాట్లాడుతూ.. తల్లి కావడం అనేది ఒక మహిళ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అందరూ చెప్తుంటారని, ఆ మార్పును స్వీకరించడానికి తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు తనపై ఎంతో నమ్మకం ఉంచుతాడని, ఏ దశలోనూ ధైర్యం కోల్పోకుండా నిరంతరం సపోర్ట్‌గా ఉంటాడని తెలిపింది. అలాగే మహిళల నిర్ణయాధికారంపై కూడా సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'మహిళలు ఎప్పుడూ ఇతరుల ఎంపిక కోసం వేచి చూడాలి. తాము సొంతంగా ఎంచుకోకూడదనేది మన సమాజంలో చెప్పే అతిపెద్ద అబద్ధం. ఉద్యోగం, బంధాలు లేదా జీవితంలో ఉన్నత పదవులు.. ఏదైనా సరే నిర్ణయం తీసుకునే హక్కు, ఎంచుకునే శక్తి మహిళలకే ఉంది' అని చెప్పుకొచ్చింద. ప్రస్తుతం సామ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Updated Date - Sep 09 , 2026 | 09:57 PM