సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samantha: అమ్మ కాబోతున్న క్షణాలు.. సామ్ ఏం చెప్పారంటే

ABN, Publish Date - Sep 13 , 2026 | 09:18 AM

సమంత జీవితంలో ఇప్పుడు సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. తల్లిగా మారబోతున్నానన్న వార్త తన జీవితంలో ఊహించని, ఎంతో అందమైన ఆశ్చర్యంగా మారిందని భావోద్వేగంతో పంచుకున్నారు.

సమంత (Samantha) జీవితంలో ఇప్పుడు సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. తల్లిగా మారబోతున్నానన్న వార్త తన జీవితంలో ఊహించని, ఎంతో అందమైన ఆశ్చర్యంగా మారిందని భావోద్వేగంతో పంచుకున్నారు. తల్లిని (Samantha Motherhood) కాబోతున్నానన్న విషయం తమ జీవితంలో ప్రత్యేకమైన ఆనందాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.  

"జీవితంలో పిల్లలు కలగడం, కలగకపోవడం రెండింటికీ నేను, రాజ్‌ సిద్ధపడ్డాం. కానీ నేను తల్లిని కాబోతున్నానన్న వార్త మా జీవితంలో ఒక అందమైన ఆశ్చర్యం. ‘తస్సాదియ్యా’ పాట షూటింగ్‌ సమయంలో నాకు ఈ విషయం తెలిసింది. ఆ పాటలోని కొన్ని స్టెప్స్‌ చేస్తున్నప్పుడు కొద్దిగా నీరసం అనిపించింది. ఒక బిడ్డ జన్మించాక జీవితం పూర్తిగా మారిపోతుందని ప్రతి ఒక్కరు చెబుతుంటారు. ఆ సరికొత్త మార్పును, మాతృత్వాన్ని ఆస్వాదించడానికి నేను పూర్తి సిద్ధంగా ఉన్నాను. నా సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా’ ద్వారా మహిళా ప్రాధాన్యం ఉన్న వైవిధ్యమైన కథలను, కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాను. సమాజంలో మహిళలు తాము కోరుకున్న జీవితాన్ని ఎంచుకునేలా వారిలో ధైర్యాన్ని పెంపొందించడమే నా ఆశయం. ప్రస్తుతం నా శరీరం ఇచ్చే సూచనలు వింటూ, మాతృత్వంతోపాటు వ్యాపారం, నిర్మిస్తున్న సినిమాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను.   


ALSO READ:

Keerthy Suresh: దశాబ్దం తర్వాత టిఫ్‌లో తమిళ సినిమా.. ‘డోరతి’కి స్టాండింగ్‌ ఒవేషన్!

Samantha: ఏది ముఖ్యమో దానికే ప్రాధాన్యం.. సమంతలో ఇంత మార్పా? 


Vijay-Trisha: త్రిష రాగానే విజయ్ ఎందుకు ముఖం తిప్పుకున్నారు? నెటిజన్ల చర్చ!

Updated Date - Sep 13 , 2026 | 10:20 AM