సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సామ్ ‘సీక్రెట్’ కౌంటర్స్‌

ABN, Publish Date - Jun 25 , 2026 | 05:30 PM

మొత్తానికి సమంత ఓపెన్ అయింది. రిలేషన్ షిప్ పై ఎవరు ఊహించని కామెంట్లను చేసింది. అంతేకాదు రిలేషన్ షిప్ లోకి వెళ్లే వారికి ఉచిత సలహాలను కూడా ఇచ్చింది. ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Samantha Secret Counters

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత డబుల్ ధమాకా మోడ్‌లో ఉంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఫుల్ జోష్‌లో ఉంది. ఒక వైపు తను నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సామ్ ఆనందానికి అవధులు లేవు. పైగా అదే టైమ్‌లో ప్రెగ్నెన్సీ కూడా కన్‌ఫర్మ్ కావడంతో ఒకేసారి డబుల్ ధమాకా లభించినట్టుగా ఎంజాయ్ చేస్తోందీ ముద్దుగుమ్మ. ఈ హ్యాపీ మూమెంట్‌లో రీసెంట్‌గా మీడియా ముందుకు వచ్చిన సమంత.. రిలేషన్‌షిప్స్‌పై చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో సామ్ ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నదా? అని అందరూ చర్చించుకుంటున్నారు.


రిలేషన్‌షిప్స్ గురించి సమంత చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడింది. బంధాలు అనేవి చాలా క్లిష్టమైనవని, అవి ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండవని చెప్పింది. ఇద్దరూ కలిసి సమానంగా ఎఫర్ట్స్ పెడితేనే ఏ బంధమైనా స్ట్రాంగ్‌గా నిలబడుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు... అవతలి వ్యక్తి వచ్చి మనల్ని ఏదో ఆదుకుంటాడని, మనల్ని హ్యాపీగా ఉంచుతాడని ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని, ముందు మనల్ని మనం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాతే రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాలని సూపర్ సలహా ఇచ్చింది. ఇద్దరూ సమానంగా కృషి చేస్తేనే బంధం బాగుంటుందని సమంత అభిప్రాయపడింది.


ఇదే వేదికపై డైరెక్టర్ నందిని రెడ్డి కూడా సమంత మాటలను పూర్తిగా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అమ్మాయిలు ఎప్పుడూ తమ సక్సెస్‌ను చూసి మురిసిపోయే పార్ట్‌నర్‌ను ఎంచుకోవాలని సూచించారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా రాజ్ నిడిమోరు పేరును ప్రస్తావిస్తూ.. సమంతను ఎవరైనా పొగిడితే రాజ్ ఎంతో గర్వంగా.. హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పుకొచ్చారు. అమ్మాయిలు తమ విజయాన్ని చూసి గర్వపడే భాగస్వామిని ఎంచుకోవాలని ఆమె సూచించింది. సమంత, నందిని రెడ్డి కలిసి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే సమంత ఇవన్నీ జనరల్‌గా చెప్పిందా లేక ఎవరినైనా మనసులో పెట్టుకుని ఈ రేంజ్‌లో కౌంటర్లు వేసిందా అంటూ నెటిజన్లు రకరకాలుగా డిస్కషన్స్ మొదలుపెట్టేశారు. 'మా ఇంటి బంగారం'లోనూ తన గతాన్ని అడ్డం పెట్టుకుని తనతో ఆడుకోవాలని చూసిన విలన్ తో సమంత చెప్పే కొన్ని డైలాగ్స్ వింటుంటే... ఎవరినో మనసులో పెట్టుకుని, ఆ సంభాషణలు రాయించినట్టున్నారని కామెంట్ చేసిన వారూ లేకపోలేదు. కొంత మంది మాత్రం టైమ్‌ చూసి, మాజీ భర్తకు సమంత కౌంటర్స్ ఇస్తోందని గుసగుసలాడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Tollywood: పర్శంటేజ్‌ పై ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షరతులు!

లీగల్ వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?

‘పెద్ది’ సక్సెస్ చూసి నాకు ‘ఠాగూర్’‌లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్

Updated Date - Jun 25 , 2026 | 05:55 PM