సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chai -Sam: చై, సామ్ మధ్య ఆ బంధం ఇంకా కొనసాగుతూనే ఉందని తెలుసా?

ABN, Publish Date - Jun 20 , 2026 | 04:20 PM

నాగచైతన్య, సమంత కొన్నేళ్ల ప్రేమ తర్వాత వివాహ బంధంతో ఒకటయ్యారు. నాలుగేళ్లు భార్యభర్తలుగా అన్యోన్యంగా ఉన్నారు.

నాగచైతన్య (Akkineni Naga chaitanya), సమంత (Samantha) కొన్నేళ్ల ప్రేమ తర్వాత వివాహ బంధంతో ఒకటయ్యారు. నాలుగేళ్లు భార్యభర్తలుగా అన్యోన్యంగా ఉన్నారు. పరిస్థితులు తారుమారు కావడంతో 2021లో ఇద్దరూ వివాహ బంధానికి స్వస్తి చెప్పి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి జీవితాలతో వారు బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఓ బంధం అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. (Hash dog)

అదేంటంటే.. చై, సామ్‌ ఇద్దరూ డాగ్‌ లవర్స్‌. వీరిద్దరూ కలిసున్నప్పుడు హష్‌ అనే కుక్క పిల్లను  తెచ్చుకున్నారు. దానిని ఎంతో ముద్దుగా ఓ బిడ్డలా పెంచుకున్నారు. తర్వాత ఇద్దరు విడాకులు తీసుకుని వేర్వేరుగా జీవిస్తున్నారు. అయినా హష్‌తో బంధం మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందట. సమంతకు హష్‌ అంటే ప్రాణం. చైతూకి కూడా. ఇద్దరూ దానిని విడిచి ఉండలేరు. అది కూడా చై, సామ్‌లను విడిచి ఉండలేదు.

అందుకే దాని ఆలనా పాలనను ఇద్దరూ షేర్‌ చేసుకున్నారు. హష్‌ బాధ్యతను కొద్ది రోజులు సమంత చూసుకుంటే.. మరికొన్ని రోజులు నాగచైతన్య చూసుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో ఉన్న వ్యక్తిగత మేనేజర్స్ అటు ఇటు దాన్ని తిప్పుతుంటారట. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు భార్యభర్తలుగా వీరిద్దరూ విడిపోయినా పెట్‌ డాగ్‌ విషయంలో మాత్రం ఇద్దరూ ఈ బంధాన్ని కొనసాగిస్తున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సమంత తాజాగా నటించి, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందినీరెడ్డి ఈ చిత్రానికి దర్శకురాలు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో ముందుకెళ్తోంది. 

ఇవి కూడా చదవండి:

‘OG 2’లో ఊహించని మార్పులు.. షూటింగ్ డేట్ ఫిక్స్!

పవన్ అభిమాని నిరంజన్‌‌ను ఈ రోజే కలవడానికి కారణమిదే: బండ్ల గణేష్

మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

రుక్మిణి వసంత్‌ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్!

Updated Date - Jun 20 , 2026 | 05:41 PM