సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చరణ్ మాస్ స్టెప్స్.. సమంత రియాక్షన్ ఇదే

ABN, Publish Date - Mar 03 , 2026 | 05:47 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పెద్ది (Peddi).

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది (Peddi). వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ఫస్ట్ షాట్, చికిరి చికిరి సాంగ్ ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఏప్రిల్ 30 న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్రబృందం సినిమా నుంచి ఒక్కో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. మార్చి 2న పెద్ది సెకండ్ సింగిల్ రైరై రారా రిలీజ్ అయిన సంగతి తెల్సిందే.

హీరో క్యారెక్టరైజేషన్ ను తెలిపే ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ మాస్ స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ పై కొందరు విముఖత చూపిస్తున్నారు. ఎప్పుడు ఒకేలాంటి స్టెప్స్ తో జానీ మాస్టర్ బోర్ కొట్టిస్తున్నారని పెదవి విరుస్తున్నారు. మరికొందరు మాత్రం చరణ్ గ్రేస్ చూసి షాక్ అవుతున్నారు. చిరంజీవిని మించి చరణ్ డ్యాన్స్ చేశాడు అని కామెంట్స్ పెడుతున్నారు.

చరణ్ డ్యాన్స్ చూసి కేవలం అభిమానులు మాత్రమే కాదు హీరోయిన్ సమంత కూడా ఫిదా అయ్యారు. చరణ్ మాస్ స్టెప్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. రామ్ చరణ్ ఒకే ఒక్కడు అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ - సమంత కలిసి రంగస్థలం సినిమాలో నటించారు. అప్పటి నుంచి సామ్.. చరణ్ యాక్టింగ్ కి, డ్యాన్స్ కి పెద్ద ఫ్యాన్. ఇక సామ్ పోస్ట్ చూసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి పెద్ది సినిమాతో చరణ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

Updated Date - Mar 03 , 2026 | 06:26 PM