ప్రెగ్నెంట్ అయినా తగ్గని సామ్.. జిమ్ లో కసరత్తులు చేస్తూ
ABN, Publish Date - Aug 26 , 2026 | 04:47 PM
చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలోని ప్రతి దశను ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ నటి సమంత ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తూ వస్తుంది.
చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలోని ప్రతి దశను ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ నటి సమంత (Samantha) ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తూ వస్తుంది. ఇక గతేడాది చివర్లో ప్రముఖ ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరును ప్రేమించి పెళ్లి చేసుకొని సామ్ కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెల్సిందే. అమ్మ అని పిలిపించుకోవడానికి సామ్ ఎంత తహతహలాడుతోందో ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. ఆ మూమెంట్ కోసం ప్రతిరోజూ ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ తన ప్రెగ్నెన్సీ డైరీస్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రీనాటల్ ట్రైనింగ్ అంటే గర్భధారణ సమయంలో చేసే ప్రత్యేక వ్యాయామాలు సెషన్‌కు సంబంధించిన కొన్ని క్యాండిడ్ పిక్చర్లను సమంత పోస్ట్ చేసింది. తల్లి కాబోతున్న తరుణంలో వ్యాయామం చేయడం, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం పట్ల ఒక సరికొత్త దృక్పథాన్ని ఈ చిత్రాల ద్వారా ఆమె చెప్పుకొచ్చింది. సాధారణంగానే సమంత జిమ్ ఎక్కువ చేస్తుంది అన్న విషయం అందరికీ తెల్సిందే. ఇక ఈ సమయంలో కూడా సామ్ తగ్గేదేలేదు అంటూ వర్క్ అవుట్స్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇక ఈ పిక్స్‌కి ప్రెగ్నెన్సీ సమయంలో యాక్టివ్‌గా ఉండటం అంటే మన శరీరం చెప్పే మాటను, ఇచ్చే సంకేతాలను శ్రద్ధగా వినడమేఅంటూ సమంత అర్థవంతమైన క్యాప్షన్ జోడించింది. గర్భధారణ సమయంలో శరీరంలో వచ్చే మార్పులను గౌరవిస్తూ, దానికి తగినట్లుగా వ్యాయామాలు చేయడం ఎంతో ముఖ్యమని ఆమె వివరించింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ప్రీనాటల్ వర్కౌట్ పిక్స్, క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె ఇన్స్‌పైరింగ్ ఆలోచనలపై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.