బంగారం ఫ్రెండ్.. జూనియర్ సూర్యకాంతం అని మీకు తెలుసా
ABN, Publish Date - Jun 20 , 2026 | 06:50 PM
ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు.. ఎప్పుడు స్టార్స్ గా మారతారు అనేది చెప్పడం చాలా కష్టం. కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా అనుకున్న గుర్తింపు రాదు.
ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు.. ఎప్పుడు స్టార్స్ గా మారతారు అనేది చెప్పడం చాలా కష్టం. కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా అనుకున్న గుర్తింపు రాదు. కానీ, కొంతమందికి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోతారు. అలా ఓవర్ నైట్ స్టార్ గా మారింది మంజూష ముక్కవిల్లి (Manjusha Mukkavilli). ఎవరిమె అంటే.. సమంత (Samantha) నటించిన మా ఇంటి బంగారం (Maa Inti Bangaram) సినిమా చూసినవారికి టక్కున గుర్తొస్తుంది. లేదు.. సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యేవారికి మంజు కుట్టిలు అని చెప్తే చాలు.. ఓ జూనియర్ సూర్యకాంతమా అని చెప్పేస్తారు. అంతలా ఆమె ఫ్యాన్స్ ని మెప్పించింది. రీల్స్ నుంచి ఇండస్ట్రీ వరకు మంజు కుట్టిల్లు ఎలా ఎదిగింది అనేది తెలుసుకుందాం.
మంజూష ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో మంజు కుట్టిల్లుకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందరిలా రీల్స్ చేయడం, ఇంట్లో అవి ఇవి చూపించడం లాంటివి కాకుండా.. పాత సినిమాలను ఆమె గుర్తుచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సూర్యకాంతం పాత్రలో ఆమె ఒదిగిపోతుంది అని చెప్పొచ్చు. సూర్యకాంతం, బ్రహ్మానందం సీన్స్ ని రీల్స్ చేస్తూ కామెడీ పంచుతూ ఉంటుంది. ఆమె రీల్స్ కి సపారేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. 151కె ఫాలోవర్స్ ఉన్న మంజు సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్. ఇక ఆమె వీడియోలను సోషల్ మీడియాలో చూసిన నందినిరెడ్డి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు.
ఇక ఇచ్చిన ఛాన్స్ ని మంజు చక్కగా వినియోగించుకుంది. మొదటి సినిమానే అయినా.. అది సమంత లాంటి స్టార్ పక్కన అయినా కూడా ఎలాంటి బేరుకు లేకుండా న్యాచురల్ గా నటించి మెప్పించింది. సమంత ఫ్రెండ్ గా.. ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సామ్- మంజు ట్రాక్ సినిమాకు హైలైట్ గా మారింది. ఫ్రెండ్ కోసం ఏదైనా చేసే గృహిణిగా ఆమె యాక్టింగ్ సూపర్. మా ఇంటి బంగారం సినిమాతో మంజు ఓవర్ నైట్ స్టార్ గా మారింది. తెలుగులో ఆమెను వాడుకుంటే మంచి లేడీ కమెడియన్ అవుతోంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మరి బంగారం తరువాత మంజు సినిమాల్లో బిజీగా మారుతుందా.. లేదా అనేది చూడాలి.