సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బంగారం సక్సెస్ క్రెడిట్ భర్త రాజ్ దే నన్న సమంత

ABN, Publish Date - Jun 23 , 2026 | 06:18 PM

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత (Samantha) నటించిన మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. మొదట మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలక్షన్స్ లో కుమ్మేస్తోంది.

samantha

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత (Samantha) నటించిన మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. మొదట మిక్స్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలక్షన్స్ లో కుమ్మేస్తోంది. నాలుగు రోజుల్లో రూ. 50 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా సాధించిన అద్భుతమైన విజయానికి గాను చిత్ర యూనిట్‌కు ఊహించని మెగా గౌరవం లభించింది. మెగాస్టార్ చిరంజీవి మా ఇంటి బంగారం చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా పిలిపించి, మనస్ఫూర్తిగా అభినందించారు. సామ్ పై ప్రశంసలు కురిపించారు.


అయితే ఈసారి మాత్రం సమంత మా ఇంటి బంగారం సక్సెస్ క్రెడిట్ అంతా భర్త రాజ్ నిడిమోరుకే ఇచ్చేసింది. చిరంజీవి.. సామ్ ని ఉద్దేశించి.. ఆమె చాలా టాలెంటెడ్ అని అన్నారు. దానికి సమంత.. 'ఇది కేవలం రాజ్ వలనే సాధ్యమైంది. దీనిని ఇంకా ఆయన స్పెషల్ గా మార్చాడు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత.. భర్త గురించి ఇంతలా మాట్లాడం చాలా బాగుందని, ప్రతి భార్య ఇలానే ఉండాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


బాలీవుడ్ లలో స్టార్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ నిడిమోరు, భార్య సమంతతో కలిసి నిర్మించిన మా ఇంటి బంగారం తో ఈ రేంజ్ బాక్సాఫీస్ హిట్ అందుకోవడం విశేషం. ఒకవైపు లేడీ సూపర్ స్టార్‌గా థియేటర్లను షేక్ చేస్తూనే, మెగాస్టార్ ప్రశంసలు కురిపిస్తున్న వేళ తన విజయం వెనుక ఉన్న భర్త శ్రమను, సపోర్ట్‌ను గుర్తించి స్టేజ్ పై క్రెడిట్ ఇవ్వడం సమంత సంస్కారానికి నిదర్శనమని నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అప్రిసియేషన్, దానికి సమంత ఇచ్చిన ఈ ఎలిగెంట్ రిప్లై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Updated Date - Jun 23 , 2026 | 06:52 PM