వందకోట్ల క్లబ్ లో బంగారం.. ఇది కదా సమంత రేంజ్
ABN, Publish Date - Jul 12 , 2026 | 03:06 PM
ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరోయిన్ సృష్టించని రికార్డ్ ని స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సృష్టించింది. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram). నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మించాడు.
ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరోయిన్ సృష్టించని రికార్డ్ ని స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సృష్టించింది. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram). నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మించాడు. ఇక ఎన్నో అంచనాల నడుమ జూన్ 19 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. విడుదలై 23 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతూ రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధిగమించింది.
టాలీవుడ్ చరిత్రలోనే ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం ఈ స్థాయి భారీ వసూళ్లను సాధించడం ఇదే ప్రథమం. ఈ అద్భుతమైన ఘనతతో, తెలుగు రాష్ట్రాల నుంచి ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాను తన భుజాలపై వేసుకుని 100 కోట్ల క్లబ్‌లో చేర్చిన తొలి నటిగా సమంత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటివరకు ఈ రికార్డ్ ని అనుష్క కూడా అందుకోలేకపోయింది.
ఒక సాధారణ గృహిణి తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం తన గతాన్ని ఎదుర్కొని ఎలా పోరాడింది అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో సమంత నటన, ముఖ్యంగా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నెగటివ్ ట్రెండ్స్, భారీ పోటీని సైతం తట్టుకుని ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఇక ఈ విషయం తెలియడంతో సమంత ఫ్యాన్స్.. ఇది కదా సమంత రేంజ్ అని కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తరువాత అమ్మడు నటించిన ప్రతి సినిమా ప్లాప్ ని అందుకుంది. ఇక రాజ్ తో పెళ్లి తరువాత సామ్ రీఎంట్రీ అదిరిపోయింది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న సామ్.. కొంత గ్యాప్ తరువాత మళ్లీ తెరపై కనిపించేవరకు ఈ రికార్డును వేరే హీరోయిన్ బ్రేక్ చేస్తుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.