సలార్ 2: శౌర్యాంగ పర్వంపై నిర్మాత అప్‌డేట్
ABN, Publish Date - Mar 03 , 2026 | 03:10 PM
ప్రభాస్(Prabhas), ప్రశాంత్ నీల్ (Prashanth neel) కాంబోలో సలార్: సీజ్‌ఫైర్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘శౌర్యాంగ పర్వం’ (Salaar 2) రానుంది.
ప్రభాస్(Prabhas), ప్రశాంత్ నీల్ (Prashanth neel) కాంబోలో సలార్: సీజ్‌ఫైర్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘శౌర్యాంగ పర్వం’ (Salaar 2) రానుంది. ఈ సినిమా గురించి చాలా కాలంగా ఎలాంటి అప్‌డేట్ లేదు. ప్రేక్షకులు దాని కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో నిర్మాత విజయ్ కిరగందూర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘సలార్ 2’ మొదటి పార్టును మించి ఉంటుంది. అంతగా కమిట్‌మెంట్‌తో దర్శకుడు పని చేస్తున్నారు. ఈ చిత్రం ఓ వండర్‌గా అనిపిస్తుంది. ప్రభాస్ అభిమానులు సినిమా అప్‌డేట్ కోసం పెడుతున్న పోస్టులు మా దృష్టికి వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నారు. అవి పూర్తి అయ్యాక ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. అది కూడా అతి త్వరలోనే ఉంటుంది’ అని అన్నారు.
ఇంకా ఆయన చెబుతూ ‘ఇండస్ట్రీలో ఉన్న గొప్ప దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. ఆయనను, ఆయన పనిని విమర్శించుకోవడంలో ముందుంటారు. ‘సలార్ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అయినా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రం విషయంలో పూర్తి సంతృప్తి చెందలేదు. సినిమాకు అద్భుతమైన ఆదరణ దక్కినప్పటికీ ఆయన వేసిన అంచనాను చేరుకోలేదని ఆయన మనసులో ఉంది. అందుకే ఈ చిత్రం ది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు’ అని అన్నారు.