సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sai Pallavi: సాయిపల్లవి చేసిన పనికి షాకైన తల్లిదండ్రులు!

ABN, Publish Date - Nov 16 , 2026 | 08:42 PM

సాయిపల్లవి మరోసారి తన నటనతో పాటు అంకితభావంతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఓ.ఎం. (ఆపరేషన్‌ మోల్‌)’ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

సాయిపల్లవి మరోసారి తన నటనతో పాటు అంకితభావంతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఓ.ఎం. (ఆపరేషన్‌ మోల్‌)’ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఐపీఎస్‌ అధికారిణి నిత్యా రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు మరింత సహజత్వం తీసుకొచ్చేందుకు సాయిపల్లవి ఏకంగా తన జుట్టునే కత్తిరించుకున్నారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించిన ఆమె.. తన షార్ట్‌ హెయిర్‌ చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. 

‘‘జుట్టు కత్తిరించుకున్న తర్వాత మా అమ్మకు వీడియో కాల్‌ చేశాను. నా కొత్త లుక్‌ చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. కోపంతో వెంటనే కాల్‌ కట్‌ చేశారు. ఆ తర్వాత మా నాన్నకు ఫోన్‌ చేసి మాట్లాడితే.. విగ్‌ పెట్టుకున్నావా అని అడిగారు. నిజంగానే జుట్టు కత్తిరించుకున్నానని చెప్పడంతో ఆయన కూడా ఆశ్చర్యపోయారు. అమ్మకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పడానికి నాన్న కొన్ని రోజులు ప్రయత్నించాల్సి వచ్చింది. ఆ తర్వాతే అమ్మ మళ్లీ నాతో మాట్లాడారు’’ అని సాయిపల్లవి తెలిపారు. అయితే, ఈ మార్పునకు తాను వెంటనే అంగీకరించలేదని ఆమె తెలిపారు.  ‘‘మరో దర్శకుడు అడిగి ఉంటే ఇంత చిన్న జుట్టుతో కనిపించడానికి ఒప్పుకునేదాన్ని కాదేమో. కానీ రాజ్‌కుమార్‌ పెరియసామి అడగడంతో అంగీకరించాను. నా పాత్రకు సంబంధించిన లుక్‌ కోసం ఆయన ఐపీఎస్‌ అధికారిణి మెరిన్‌ జోసెఫ్‌ ఫొటోను రిఫరెన్స్‌గా చూపించారు’’ అని వివరించారు.

రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. నవంబరు 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత ఈ చిత్రానికి ‘ఓం’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. సెన్సార్‌ బోర్డు సూచనల మేరకు ‘ఓ.ఎం. (ఆపరేషన్‌ మోల్‌)’గా మార్చారు. 

Updated Date - Nov 16 , 2026 | 09:09 PM