Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’ తర్వాత సాయి తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్!
ABN, Publish Date - Oct 15 , 2026 | 05:04 PM
సాయి దుర్గా తేజ్ తదుపరి చిత్రానికి సంబందించిన అప్డేట్ వచ్చింది. విభిన్నమైన కథలు, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
సాయి దుర్గా తేజ్ (Sai Durga tej) తదుపరి చిత్రానికి సంబందించిన అప్డేట్ వచ్చింది. విభిన్నమైన కథలు, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన 19వ చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్టును ప్రకటిస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. సాయి దుర్గా తేజ్ నటించబోతున్న19వ చిత్రానికి తేజ కాకుమాను (Teja Kakumanu) దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. అనిల్ సుంకర నిర్మాత. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న తేజ కాకుమానుఇప్పుడు ఈ సినిమాతో వెండితెరపై తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. కుటుంబ సంబంధాలు, వినోదం చుట్టూ సాగే కథలను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో తేజ కనుమకు మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మెగా హీరో కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారు? తేజ్ను ఏ తరహా పాత్రలో చూపించబోతున్నారు? అనే ఆసక్తి మెగా అభిమానుల్లో ఉంది.
భారీ అంచనాల నడుమ ‘సంబరాల ఏటిగట్టు’
మరోవైపు సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’పైనా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో కొత్త తరహా కథను ప్రేక్షకులకు అందించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.