సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సంక్రాంతి రేసులో ఇగో వార్.. తగ్గేదేలేదంటూ

ABN, Publish Date - Aug 17 , 2026 | 03:19 PM

టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటేనే పెద్ద సినిమాల జాతర. స్టార్ హీరోల ఫ్యాన్స్.. సంక్రాంతి విన్నర్ తామంటే తాము అని కొట్టుకుంటూ ఉంటారు.

SYG Vs Mahakali

టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటేనే పెద్ద సినిమాల జాతర. స్టార్ హీరోల ఫ్యాన్స్.. సంక్రాంతి విన్నర్ తామంటే తాము అని కొట్టుకుంటూ ఉంటారు. ఈ ఏడాది సంక్రాంతి సీనియర్ హీరోలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి మరింత రసవత్తరంగా ఉండబోతుంది. ముఖ్యంగా వచ్చే ఏడాది పండగలో ఆసక్తికరమైన పోరాటాలు చోటుచేసుకొనున్నాయి. ఈ సంక్రాంతి రేసులో అందరి చూపు ఈ రెండు సినిమాల మీదనే ఉన్నాయి. అవేంటంటే సాయి దుర్గా తేజ్ నటిస్తోన్న సంబారాల ఏటి గట్టు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తోన్న మహాకాళి చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


సాయి దుర్గా తేజ్ సినిమా అనేక వాయిదాల తర్వాత జనవరి 12 న సంబరాల ఏటిగట్టుతో రాబోతుండగా, ప్రశాంత్ వర్మ మహాకాళి జనవరి 8న విడుదలయ్యేలా ప్లాన్ చేశారు. ఈ రెండు చిత్రాల మధ్య పోటీ కేవలం థియేటర్ల విడుదలకు మాత్రమే పరిమితం కాలేదు, దీని వెనుక పాత విభేదాలు కూడా ఉన్నాయనే వార్తలు కోడై కూస్తున్నాయి. హనుమాన్ చిత్ర నిర్మాతలు, దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య గతంలో కొన్ని విషయాల్లో విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి సంబంధిత చిత్రాలు ఒకే సంక్రాంతి సీజన్‌లో నేరుగా పోటీ పడుతుండటంతో ఇది పగ, ఇగోల కారణంగానే వెనక్కి తగ్గకుండా పండగ బరిలోకి దిగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ రెండు చిత్రాల జానర్లు పండగ వాతావరణానికి సెట్ అవుతాయా.. లేదా .. అనేది తెలియదు. కానీ, కచ్చితంగా సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గేదేలేదు అని అటు నిరంజన్ రెడ్డి .. ఇటు ప్రశాంత్ వర్మ పట్టుబట్టుకొని కూర్చున్నారని సమాచారం.


మరోవైపు 2027 సంక్రాంతి పోటీ ఎన్నడూ లేనంత గట్టిగా మారబోతోంది. మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబోలో వస్తోన్న మెగా158, నాగార్జున మైలురాయి చిత్రం కింగ్100 కూడా సంక్రాంతినే లక్ష్యంగా చేసుకున్నాయి. అలాగే వెంకటేష్-కళ్యాణ్ రామ్-అనిల్ రావిపూడి మల్టీస్టారర్, రవితేజ-శ్రీవిష్ణు సినిమా, శర్వానంద్-శ్రీను వైట్ల కాంబో ప్రాజెక్ట్, మారుతి దర్శకత్వంలో హ్యాపీ పొంగల్ చిత్రాలు కూడా పండగ రేసులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని పెద్ద సినిమాలు ఒకే సీజన్‌లో పోటీ పడుతుండటంతో రాబోయే సంక్రాంతి 2027 బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరిత పోరుగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - Aug 17 , 2026 | 03:19 PM