Sai Dharam: స్పీడు పెంచిన.. సాయి ధరమ్ తేజ్
ABN, Publish Date - Feb 01 , 2026 | 03:04 PM
కెరీర్ బిగినింగ్ లో వరుస విజయాలు అందుకున్నారు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత కాస్త వేగం తగ్గించాడు. రోడ్డు ప్రమాదం జరగడం, కొంత కాలం విశ్రాంతి తీసుకోవడం కూడా అందుకు ఒక కారణం.
కెరీర్ బిగినింగ్ లో వరుస విజయాలు అందుకున్నారు సాయి ధరమ్ తేజ్(Sai dharam Tej) ఆ తర్వాత కాస్త వేగం తగ్గించాడు. రోడ్డు ప్రమాదం జరగడం, కొంత కాలం విశ్రాంతి తీసుకోవడం కూడా అందుకు ఒక కారణం. ‘విరూపాక్ష’ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా చేస్తున్నాడు. రోహిత్ దర్శకుడు. తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమిది. దీని తరవాత చేయబోయే రెండు ప్రాజెక్టులు కూడా ఫిక్స్ అయ్యాయి.
ఈసారి కొత్త దర్శకులతో వర్క్ చేయడానికి తేజ్ సిద్దమయ్యాడు. ‘సేవ్ ది టైగర్స్’తో ఆకట్టుకొన్న దర్శకుడు తేజ కాకమాను సాయిధరమ్ తేజ్ కోసం ఓ కథ సిద్ధం చేశారు. ఇటీవలే ఇద్దరి మధ్యా చర్చలు జరిగాయి. తేజ్ కి ఈ కథ బాగా నచ్చడంతో పచ్చ జెండా ఊపేశాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించనుంది. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
యూవీ క్రియేషన్స్ లో తేజ్ హీరోగా మరో సినిమా రూపొందించే అవకాశం ఉంది. సిద్దూ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడని తెలిసింది. అయితే ముందుగా తేజ సినిమానే మొదలు కానుంది. దేవాకట్టా కూడా తేజ్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘రిపబ్లిక్’ సినిమా వచ్చింది.