సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దైవ త‌న్మ‌య‌త్వంలో.. సెల‌బ్రిటీలు

ABN, Publish Date - Feb 20 , 2026 | 09:43 PM

ఇటీవ‌ల కోయంబ‌త్తూరులోని స‌ద్గురు ఇషా పౌండేష‌న్ లో మ‌హా శివ‌రాత్రి ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే.

sadhguru isha

ఇటీవ‌ల కోయంబ‌త్తూరు (Coimbatore) లోని స‌ద్గురు (Sadhguru) ఇషా పౌండేష‌న్ (Isha Foundation) లో మ‌హా శివ‌రాత్రి (Mahashivratri) ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే.

ఈ వేడుకుల‌కు దేశ విదేశాల నుంచి భ‌క్తులు హ‌జ‌రు కాగా వారిని ఆల‌రించేందుకు పేరు పొందిన గాయ‌కులు, సంగీతకారులు ఇత‌ర రంగాలు సైతం విచ్చేసి అక్క‌డికి వ‌చ్చిన ల‌క్ష‌లాది మందిని భ‌క్తి త‌న్మ‌య‌త్వంలో ఓల‌లాడించారు.

కాగా ఈ ఈవెంట్‌లో అనేక మంది సినీ సెల‌బ్రిటీలు ముఖ్యంగా సారా అర్జున్ (Sara Arjun), త‌మ‌న్నా (Tamannaah Bhatia), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty), మౌనీ రాయ్ వంటి సెల‌బ్రెటీలు కూడా పాల్గొని భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగిపోయారు.

అంతేగాక అక్క‌డి ప్ర‌కృతి సోయ‌గ‌ల న‌డుమ సేద తీరారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను తాజాగా హిట్ మూవీ బ్యూటీ శ్రీ నిధి శెట్టి త‌న ఇన్ స్టా ద్వారా పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రాలు సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Updated Date - Feb 20 , 2026 | 09:45 PM