సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Epic Song: దేశం కానీ దేశంలో.. కుల్లా కుల్లా బతికేయ్ రా

ABN, Publish Date - Sep 01 , 2026 | 06:36 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ (EPIC – First Semester).

Epic

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ (EPIC – First Semester). బేబి వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ ఒకటవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


తాజాగా ఈ సినిమా నుంచి సబ్కో అనే యూత్‌ఫుల్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ హెషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన ఈ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీ హర్ష ఈమాని రాసిన సాహిత్యం, సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ల పవర్ ఫుల్ వాయిస్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కాలేజ్ లైఫ్, పార్ట్-టైమ్ జాబ్స్, ఫ్రెండ్‌షిప్, ఫన్ ఎలిమెంట్స్‌ను ఆవిష్కరిస్తూ ఈ పాటను ఎంతో కలర్‌ఫుల్‌గా చిత్రీకరించారు.


కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించబోతోంది. 90's వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా ఎపిక్ రాబోతుంది. అసలు చదువు రాని కుర్రాడు.. విదేశాలకు ఎలా వెళ్ళాడు..? అక్కడ అమ్మాయితో ప్రేమ, కెరీర్ ని ఎలా సక్సెస్ గా మార్చాడు అనేది ఎపిక్ కథగా తెలుస్తోంది. ఇకపోతే ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమాతో బేబీ జంట మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటుందో లేదో చూడాలి.

Updated Date - Sep 01 , 2026 | 06:40 PM