Sunitha: జానకమ్మతో మధుర క్షణాలు.. సునీత భావోద్వేగ పోస్ట్
ABN, Publish Date - Jul 12 , 2026 | 09:37 AM
పగలే వెన్నెల.. జగమే ఊయల.. మనసా తుళ్లి పడకే.. అతిగా ఆశ పడకే.. అబ్బనీ తియ్యనీ దెబ్బ.. ఎంత కమ్మగా.. మూడు తరాలనూ అలరించిన పాటలివి..
పగలే వెన్నెల.. జగమే ఊయల..
మనసా తుళ్లి పడకే.. అతిగా ఆశ పడకే..
అబ్బనీ తియ్యనీ దెబ్బ.. ఎంత కమ్మగా..
మూడు తరాలనూ అలరించిన పాటలివి..
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
ఈ దుర్యోధన, దుశ్శాసన దుర్వినీత లోకంలో..
సెప్టెంబరు చూసం... సెప్టెంబరు మాసం...
అది ప్రేమ గీతమైనా.. విరహ గీతమైనా.. విషాద గీతమైనా
క్లాసికల్.. మెలోడీ ఏదైనా ఆ గొంతు అలవోకగా పలికేస్తుంది!
చిన్నారి గొంతు, వృద్థురాలి స్వరం, మగ గొంతుతో ఇలా ఏ జానర్ అయినా దిగ్గజ గాయని ఎస్.జానకి పాడేయగలరు. ఇప్పుడు ఆ గొంతు మూగబోయింది. గాయని ఎస్.జానకి (S Janaki) మైసూర్ లోని అపోలో ఆస్పత్రిలో లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. జానకమ్మ.. ఇక లేరు అనే విషయాన్ని సినీ సెలబ్రిటీలు, సంగీత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను గాయని సునీత (Sunitha) పోస్ట్ చేశారు.
కొన్ని నెలల క్రితం గాయని సింగర్ మైసూర్‌లోని జానకమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె స్నేహితులు, ఇతర బృందంతో కలిిసి జానకమ్మ ముందు పాటలు పాడి అలరించారు. జానకమ్మ పాడిన ‘పగలే వెన్నెల.. జగమే ఊయల’ పాటను సునీత పాడగా జానకమ్మ ఎంతో ఆనందించారు. చిరునవ్వు పూయించారు. చప్పట్లు కొట్టి సునీతను అభినందించారు. ఈ వీడియోను సునీత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ‘అమ్మతో మధుర క్షణాలు.. ఎంత సంతోషపడ్డారో.. ఎంతగా నవ్వుకున్నామో’ అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇదే జానకమ్మ చివరి వీడియో అంటూ అభిమానులు షేర్ చేస్తున్నారు.
ALSO READ:
Jailer 2: రజనీకాంత్ ఇంట్లో హృతిక్ రోషన్ సందడి!
Arya: రూ.1.80 కోట్ల బకాయి.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు