సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బిజిలీ.. ఇకనుంచి బిజీగా మారుతుందా

ABN, Publish Date - Nov 29 , 2026 | 05:02 PM

ఆకాశంలో ఒక తార సినిమాలో బిజిలీ పాత్రలో నటించిన రుహాని శర్మకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి, అల్లు అరవింద్ వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకోవడంతో ఆమె కెరీర్‌పై ఆసక్తి పెరిగింది.

Ruhani Sharma

ఇండస్ట్రీలో ఉండడం ముఖ్యం కాదు.. సరైన హిట్ పడడం కూడా చాలా ముఖ్యం. అలా హిట్ లేకనే ఎంతోమంది ఇండస్ట్రీలో ఉన్నా కూడా గుర్తింపు లేకుండా ఉండిపోయారు. కొంతమందికి మొదటి సినిమాతోనే ఆ గుర్తింపు వస్తుంది. ఇంకొందరికి కొన్నేళ్ళకు వస్తుంది. తాజాగా అందం, అభినయం కలగలిసిన నటి రుహాని శర్మ (Ruhani Sharma) విషయంలోనూ ఇదే నిజమైంది. చి ల సౌ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నప్పటికీ, ఆ తర్వాత ఆమెకు ఆశించిన స్థాయి కమర్షియల్ ప్రాజెక్టులు దక్కలేదు. కథా వైవిధ్యం ఉన్న చిత్రాలు చేసినప్పటికీ, కెరీర్‌ను ఒక్కసారిగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే పెద్ద అవకాశం మాత్రం దూరంగానే ఉంటూ వచ్చింది. దీంతో సంఖ్య పరంగా సినిమాలు చేసినా, సినీ పరిశ్రమలో ఆమెకు రావాల్సినంత గుర్తింపు రాలేదనే భావన చాలాకాలంగా వినిపిస్తోంది.


తాజాగా రుహాని శర్మ పేరు మారుమ్రోగిపోతుంది. ఆకాశంలో ఒక తార చిత్రం రుహాని శర్మ ప్రయాణంలో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బిజిలీ పాత్రలో రుహాని శర్మ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. స్క్రీన్‌టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ, తాను ఎంచుకున్న పాత్ర ద్వారా కథలో బలమైన ముద్ర వేయగలిగింది. హీరోయిన్ సాత్విక వీరవల్లికి లభించిన గుర్తింపుతో పాటు, రుహాని నటనకు కూడా మంచి స్పందన రావడం విశేషం. తక్కువ సమయంలోనే పాత్రలోని గాంభీర్యాన్ని, భావోద్వేగాలను పండించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.


దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వంటి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకోవడం రుహాని కెరీర్‌లో మర్చిపోలేని ఘట్టం. ఇక ఈ సినిమా తరువాత అమ్మడి కెరీర్ లో చాలా మార్పులు వస్తాయేమో అని నెటిజన్స్ భావిస్తున్నారు. అందం, అభినయంతో పాటు అందాల అరబోతకు కూడా రుహాని సై అనేలా ఆమె ఫోటోఘాట్స్ ఉన్నాయి. మరి అమ్మడిలోని టాలెంట్ ని ఏ డైరెక్టర్ బయటకి తీస్తాడో చూడాలి. ముందు ముందు బిజిలీ.. ఇండస్ట్రీలో బిజీగా మారుతుందేమో చూడాలి.

Updated Date - Nov 29 , 2026 | 05:08 PM