Emo Emo Idi: రూట్‌ మార్చిన ఆ ఇద్దరూ!

ABN , Publish Date - Sep 21 , 2026 | 04:34 PM

రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా నటించిన 'ఏమో ఏమో ఇది' చిత్రాన్ని అక్టోబర్ 30న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు.

Emo Emo Idi Movie

హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ మేక, దర్శకుడు శైలేష్‌ కొలను ఇద్దరూ రూట్ మార్చారు. గత యేడాది చివరిలో 'ఛాంపియన్' చిత్రంతో రోషన్ మేక మెప్పించాడు. చక్కని నటన కనబర్చి, ప్రేక్షకుల రివార్డ్ తో పాటు అవార్డులు అందుకున్నాడు. ఇప్పుడు అతను కూడా తన వయసుకు దగ్గ పాత్ర పోషిస్తున్నాడు. అలానే 'హిట్' ఫ్రాంచైజీలతో యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శైలేష్‌ కొలను ఆ తర్వాత వెంకటేశ్‌ హీరోగా 'సైంధవ్‌' మూవీని చేశాడు. అయితే ఇప్పుడు అతనూ తన పంథాకు భిన్నంగా 'ఏమో ఏమో ఇది' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 'కన్నప్ప' చిత్రంలో నటించిన ప్రీతి ముకందన్‌ ఈ సినిమాలో నాయికగా నటిస్తోంది. ఈ యూత్‌ ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్ టైనర్ అక్టోబర్ 30న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.


ఇప్పటికే విడుదలైన ‘ది ఫస్ట్ బ్రీజ్ ఆఫ్ ఏమో ఏమో ఇది’ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ వీడియో సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయడంతో పాటు, చిత్రంలోని ప్రేమకథ ఎలా ఉండబోతోందనే ఆసక్తిని పెంచింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Rashmika Mandanna: షూటింగ్‌కు వెళ్లాలంటే.. వణుకు పుట్టింది

మ‌ళ్లీ ఏమైందిరా.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్

Husharu Pittalu: ఒరేయ్.. ఏం సినిమారా ఇది.. ఇంట్లోవాళ్లతో చూస్తే చెప్పుతో కొడతారు

Updated Date - Sep 21 , 2026 | 04:42 PM