సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కాకా.. వెంకటేష్ హీరోయిన్ తో చిరు స్టెప్పులు

ABN, Publish Date - Nov 15 , 2026 | 08:47 PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కాకా (Kaka). వాల్తేరు వీరయ్య వంటి ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Ritika Singh

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కాకా (Kaka). వాల్తేరు వీరయ్య వంటి ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీలోని ఒక హై-వోల్టేజ్ స్పెషల్ సాంగ్‌లో టాలెంటెడ్ బ్యూటీ రితికా సింగ్ (Ritika Singh) మెగాస్టార్‌తో కలిసి చిందులేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం.


రితికా సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటేష్ నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రితికా. ఈ సినిమా మంచి విజయాన్ని అందించినా.. ఎందుకో తెలుగులో ఈ చిన్నదానికి పెద్ద అవకాశాలు రాలేదు. ఆ తరువాత కోలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తూ.. ఇంకోపక్క సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ కుర్రకారును షేక్ చేస్తోంది. ఇన్నాళ్ళకు రితికాకి ఒక మంచి ఛాన్స్ దొరికింది. మెగాస్టార్ చిరు సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్ భామలు క్యూ కడుతున్నా కూడా ఈ సాంగ్ రితికాని వరించింది అంటే ఆమె దశ తిరిగినట్టే అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.


మరోవైపు, ఈ సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. డిసెంబర్ 1 నుంచి కాకా మూవీ ప్రమోషనల్ సందడిని అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు థమన్ ప్రకటించాడు. అంతేకాకుండా.. '2027 సంక్రాంతికి గట్టిగా కొడతాం.. బాస్ మెగాస్టార్ ర్యాంపేజ్' అంటూ థమన్ పెట్టిన పోస్ట్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. థమన్ బీట్స్‌కు, బాస్ గ్రేస్‌ఫుల్ స్టెప్పులు.. వీటికి రితికా అందం తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. మరి ఈ సినిమా రితికాకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Updated Date - Nov 15 , 2026 | 09:09 PM