ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’కు శ్రీకారం! కీరవాణి సంగీతం
ABN, Publish Date - Feb 23 , 2026 | 06:46 AM
‘హను-మాన్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ (Jai Hanuman) ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ పొందిన ‘హను-మాన్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ (Jai Hanuman) ఆదివారం పూజా కార్యక్రమాలతో (Pooja Ceremony) ప్రారంభమైంది. హనుమంతుని జన్మస్థలంగా భావించే హంపిలోని అంజనాద్రిలో ఆదివారం చిత్రీకరణకు శ్రీకారం చుట్టారు. టీ-సిరీస్ అధినేత భూషణ్‌కుమార్ క్లాప్ ఇవ్వగా, అనిల్ థడాని ఫస్ట్ షాట్‌కు కెమెరా స్విచ్చాన్ చేశారు. తేజా సజ్జా (Teja Sajja) ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ కలసి ప్రశాంత్‌వర్మకు స్క్రిప్ట్‌ను అందించారు. జాతీయ అవార్డు గ్రహీత, ‘కాంతార’ ఫేమ్ రిషబ్‌శెట్టి (Rishab Shetty) ఈ చిత్రంలో ఆంజనేయ స్వామి పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ- సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్‌వర్మ (Prasanth varma) ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. కాగా వారణాసి సినిమా తర్వాత అస్కార్ విన్నర్ ఎం. ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషం. ఎస్. తిరునావుక్కరసు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.