గీత రచయిత పరకాల నాగన్న కన్నుమూత
ABN, Publish Date - Jul 04 , 2026 | 03:32 PM
వెండితెరపై రూపుదిద్దుకున్న చిత్రాలలో విప్లవాత్మక గీతాలను రాసిన వ్యక్తి అరుణోదయ నాగన్న. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మంలో కన్నుమూశారు.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు పరకాల నాగన్న (69) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారాం గ్రామంలో నాగన్న జన్మించారు. చిరుప్రాయంలోనే కాళ్ళకు గజ్జె కట్టి గళం ఎత్తి బయల్దేరిన పరకాల నాగయ్య నుంచి అరుణోదయ నాగన్నగా రాజకీయ పరివర్తన చెందారు. నిరుపేద గీత కార్మిక కుటుంబంలో జన్మించిన నాగన్న విప్లవ నాయకుడు రామనర్సయ్య కొరియర్ గా పనిచేసిన మధుసూదన్ రెడ్డి దగ్గర పాటలు నేర్చారు. గత 50 సంవత్సరాలుగా సాంస్కృతికోద్యమంలో నాగన్న తన వంతు పాత్ర పోషించారు. నాగన్న అరుణోదయ సంస్థ పేరునే తన ఇంటి పేరుగా ప్రాచుర్యం పొందారు.
ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి తీసిన కొన్ని చిత్రాలకు పరకాల నాగన్న పాటలు రాసి, పాడారు. 'దండోరా' సినిమాలో 'కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మా... కొడవలి చేపట్టవే చెల్లెమ్మా', 'కంపెనీ కూలోళ్ళు కపడం ఎరుగనోళ్ళు.. సారాయికి మరిగి కొంప ముంచిండు' పాటలను, 'ఛలో అసెంబ్లీ' సినిమాలో 'ఆగడు... ఆగదు... ఈ ఆకలి పోరు ఆగదు... మీ దోపిడి పాలన సాగదు' పాటను నాగన్న రాశారు. నాగన్నకు భార్య లక్ష్మి, కుమారుడు అజయ్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
Varanasi: క్రేజీ ఫొటో.. రాముడిగా మహేష్ బాబు లుక్ ఇదేనా
Bandla Ganesh: సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా.. న్యాయం సాధిస్తా..
ఒక్క సినిమా కోసం.. నాని రెండు చిత్రాలు వదిలేశాడా