'ఎల్లమ్మ'గా మృణాల్..
ABN, Publish Date - May 06 , 2026 | 05:29 PM
టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన చిత్రం ఎల్లమ్మ (Yellamma). బలగం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు వేణు ఎల్దండి (Venu Yeldandi)తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన చిత్రం ఎల్లమ్మ (Yellamma). బలగం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు వేణు ఎల్దండి (Venu Yeldandi)తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) హీరోగా నటించడం ఇండస్ట్రీలో పెద్ద సర్ప్రైజ్‌గా మారింది. ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తోన్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన దేవిశ్రీ ప్రసాద్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఎల్లమ్మకు హీరోను వెతకడానికి వేణు చాలా కష్టపడ్డాడు. నాని దగ్గర నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ వరకు అందరి పేర్లు వినిపించాయి. చివరకు దేవిశ్రీ సెట్ అయ్యాడు. ఇక ఇప్పుడు వేణు.. హీరోయిన్ల వేటలో పడ్డాడు. మొన్నటివరకు సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు బాగా వినిపించాయి. తాజాగా ఆ లిస్ట్ లో మృణాల్ ఠాకూర్ కూడా చేరింది. ఎల్లమ్మగా మృణాల్ కనిపించనుందని వార్తలు వినిపిస్తోన్నాయి. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మృణాల్ ఒక విలేజ్ మహిళగా కనిపించనుందని సమాచారం.
ఎల్లమ్మ కథ చెప్పగానే వెంటనే మృణాల్ ఓకే చెప్పిందని, త్వరలోనే మేకర్స్ ఆమె పేరును అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్.. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్, డెకాయిట్ సినిమాలతో మరింత చేరువయ్యింది. ప్రస్తుతం మృణాల్ చేతిలో అల్లు అర్జున్ రాకా సినిమా ఉంది. ఇది అయ్యాక ఆమె ఎల్లమ్మలో అడుగుపెడుతుందో.. లేక రెండు చేస్తుందో చూడాలి.