సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హారిక అండ్ హాసిని బ్యానర్ నుంచి త్రివిక్రమ్ తప్పుకున్నాడా..?

ABN, Publish Date - Nov 11 , 2026 | 05:49 PM

టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నేతృత్వంలోని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations) మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి.

Trivikram Srinivas

టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నేతృత్వంలోని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations) మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి. జులాయి చిత్రం నుంచి ఇటీవల వచ్చిన ఆదర్శ కుటుంబం వరకు ఎనిమిది వరుస హిట్ చిత్రాలతో దాదాపు 14 ఏళ్ల పాటు విజయవంతంగా సాగిన ఈ హోమ్ బ్యానర్ నుంచి త్రివిక్రమ్ తప్పుకున్నట్లు వస్తోన్న వార్త సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఆర్థిక లావాదేవీలు, ప్రాజెక్టుల వాయిదాలు, కొన్ని అంతర్గత కారణాల వల్లే త్రివిక్రమ్ ఈ సొంత బ్యానర్ నుంచి బయటకు వచ్చి ఇతర ప్రొడక్షన్ హౌసెస్‌లో సినిమాలు చేయాలని యోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ తెరపైకి రావడంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో అనౌన్స్ చేసిన పాన్-ఇండియా చిత్రం గాడ్ ఆఫ్ వార్ భవిష్యత్తు ఏంటనే ప్రశ్న నందమూరి అభిమానుల్లో నెలకొంది. ఈ ప్రాజెక్ట్ రీ-డిజైన్ అవుతోందా లేక మరో నిర్మాణ సంస్థ చేతికి వెళ్తోందా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.


అయితే మరోవైపు, ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తూ త్రివిక్రమ్ కాంపౌండ్ సన్నిహితులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ప్రస్తుతం గాడ్ ఆఫ్ వార్ సినిమా ప్రీ-ప్రొడక్షన్, స్క్రిప్ట్ పనుల్లో టీమ్ ఎంతో బిజీగా ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ పుకార్లు అని, వీటిని నమ్మవద్దని సన్నిహిత వర్గాలు చెప్తున్నారట. ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే గురూజీ స్పందిస్తే బావుంటుందని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 11 , 2026 | 05:53 PM