సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మెగాస్టార్ ని కలిసిన రేణు దేశాయ్.. కల నిజమైందంటూ

ABN, Publish Date - May 16 , 2026 | 12:35 PM

నటి రేణు దేశాయ్ (Renu Desai) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి విడాకులు ఇచ్చాకా ఆమె ఇంటికే పరిమితమయ్యింది.

Renu Desai

నటి రేణు దేశాయ్ (Renu Desai) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి విడాకులు ఇచ్చాకా ఆమె ఇంటికే పరిమితమయ్యింది. ఇద్దరు పిల్లలను చదివిస్తూ అప్పుడప్పుడు బయట కనిపించేది. కొన్నేళ్ళ క్రితం నుంచి రేణు సినిమాలకు రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రేణు యాడ్స్, కొన్ని సినిమాలు చేస్తూ.. ఇంకోపక్క మూగజీవాల కోసం ఎన్జీవో నడుపుతూ వాటికోసం పోరాడుతోంది.


తాజాగా రేణు దేశాయ్.. మాలీవుడ్ మెగాస్టార్ అయిన మమ్ముట్టిని కలిసింది. ఆయనను కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇది తన క్రేజీ మూమెంట్ అని, మమ్ముట్టిని కలవడం తన డ్రీమ్ అని చెప్పింది. ' నాకు ఇది ఒక పిచ్చెక్కిన అభిమాన క్షణం... మమ్ముట్టి సార్‌ను కలవడం, ఆయనతో కొంత సమయం గడపడం నా జీవితంలో చేయాలనుకున్న పనుల జాబితాలో ఒకటి, అది ఎట్టకేలకు నిజమైంది. ఒక వీరాభిమానిగా నా హృదయం, ఆత్మ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. నేను ఇప్పటివరకు కలిసిన వారిలో ఆయన అత్యంత ప్రతిభావంతుడు, వినయశీలి, తెలివైనవాడు మరియు దయగల వ్యక్తి' అంటూ ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - May 16 , 2026 | 12:44 PM