Renu Desai: నా పిల్లలకు ఆ కండీషన్ పెట్టాను
ABN, Publish Date - Apr 28 , 2026 | 12:51 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య, నటి రేణు దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య, నటి రేణు దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె ఒకపక్కసినిమాల్లో నటిస్తూనే ఇంకోపక్క మూగజీవాలను కాపాడే ఎన్జీవోను నడుపుతున్నారు. నిత్యం వాటికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఉండే రేణు అప్పుడప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో కూడా కనిపిస్తూ ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రేణు తన పిల్లలను ఎలా పెంచుతున్నారో తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ తో విడిపోయాక రేణు తన ఇద్దరు పిల్లలు అయిన అకీరా, ఆద్యలను ఒంటరిగానే పెంచుతున్నారు. తాను భర్తకు దూరమైనా కూడా పిల్లలను మాత్రం తండ్రికి, ఆయన కుటుంబానికి దగ్గర చేస్తూనే ఉన్నారు. మెగా ఫ్యామిలీలో ఏ వేడుక అయినా కూడా అకీరా, ఆద్య స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపిస్తారు. అయితే ఆ కుటుంబంతో పిల్లలు ఎలా నడుచుకోవాలి అనేది తాను ముందే వారికి చెప్పానని, తన ఇద్దరు పిల్లలకు ఆ విషయంలో ఒక కండీషన్ కూడా పెట్టినట్లు రేణు తెలిపారు.
'ఎప్పుడైనా పిల్లలు ప్రవర్తించే తీరే తల్లి పెంపకాన్ని తెలియజేస్తోంది. అందుకే నేను దాన్ని బలంగా నమ్ముతాను. అకీరా, ఆద్య మెగా ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్తాను. మీరు వారితో ఎలా బిహేవ్ చేస్తారో అదే నా పెంపకం. మీరు ఏం చేసినా.. ఎవరితో మాట్లాడినా నా పెంపకాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఫ్యామిలీతోనే కాదు బయట కూడా ఎవరితో మాట్లాడినా కూడా నన్ను గుర్తు ఉంచుకోండి. ఎందుకంటే .. మీరు మాట్లాడేది నా పెంపకంపై రిఫ్లెక్ట్ అవుతుంది. పిల్లలు ఏది చేసినా మొదట తల్లి పెంపకాన్నే ప్రశ్నిస్తారు. వీళ్ళ తల్లి వీరిని సరిగ్గా పెంచలేదు అంటారు అని చెప్తాను' అని తెలిపారు.