అల్లు అర్జున్‌కు ఊరట.. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:52 AM

అల్లు అర్జున్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Allu Arjun

అల్లు అర్జున్ (Allu Arjun)కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)లో ఊరట లభించింది. ఆయన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలని కోరుతూ అల్లు అర్జున్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన చిత్రాలను వాడుకుంటూ అనధికారికంగా వస్తువులను విక్రయిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ తుషార్‌రావు గెదెల ఎలాంటి అనుమతి లేకుండా ఏఐ, డీప్‌ఫేక్‌ టెక్నాలజీతో వీడియోలు, ఫొటోలు ప్రసారం చేయవద్దని ఆదేశించారు. అదేవిధంగా అల్లు అర్జున్‌ గొంతు, హావభావాలను అనుమతి లేకుండా అనధికార వాణిజ్య ప్రకటనల్లో వాడకూడదని నిషేధం విధించారు. ఈ సందర్భంగా ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

Updated Date - Apr 22 , 2026 | 05:52 AM