Akhil - Naga Chaitanya: ఎవరికి రాసిపెడితే వారి చెంతకే చేరుతుంది..
ABN, Publish Date - Jan 02 , 2026 | 05:24 PM
ఓ సినిమా కథ హీరోకి నచ్చితే మొదటి చర్చలోనే ఖాయం అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో అదే కథ తిరిగి తిరిగి ఎక్కడికో వెళ్తుంది.
ఓ సినిమా కథ హీరోకి నచ్చితే మొదటి చర్చలోనే ఖాయం అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో అదే కథ తిరిగి తిరిగి ఎక్కడికో వెళ్తుంది. ఎవరికి రాసి పెట్టి ఉంటే వారి దగ్గరకు చేరుతుంది. అదే కథను తర్వాత అనవసరంగా వదిలేశామే అనుకుని బాధపడుతుంటారు. విషయంలోకి వెళ్తే అక్కినేని సోదరులు (Akkineni Brothers) నాగచైతన్య, అఖిల్ రెండు సినిమాలు చేస్తున్నారు. నాగ్ చైతన్య మిస్టిక్ థ్రిల్లర్ జానర్‌లో ఓ సినిమా చేస్తున్నారు. 100 కోట్ల బడ్జెట్‌తో భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్నారు. కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు. ఇదే కథ ముందు రామ్ పోతినేని దగ్గరకు వెళ్లిందని తెలిసింది. ఎందుకో అది తనకు నచ్చకో లేక ఆ టైమ్‌లో మరో కథ నచ్చి దీనిని వదులుకోవడమో జరిగిందని తెలిసింది.
ఇక తమ్ముడు అక్కినేని అఖిల్ ‘లెనిన్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఓ చిత్రంతో బిజీగా ఉన్నారు. రంగస్థలం జానర్ కథ ఇది. బలగం వేణు తీయబోయే ఎల్లమ్మ సినిమా కూడా ఇలాంటి ఛాయలున్న కథే అని తెలుస్తోంది. ఈ కథ కూడా ముందు రామ్ (Ram pothineni) దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ తనకు అలాంటి కథ నప్పదనే ఆలోచనతో రామ్ నో అన్నట్లు తెలుసింది. దాంతో ఈ రెండు కథలు అక్కినేని బ్రదర్స్ దగ్గరకు చేరాయి. ఇప్పుడు ఈ రెండు కథలు హీరోలకు ప్లస్ అవుతాయనిహీరోల్లోనూ, మేకర్లలోనూ నమ్మకం వుంది.