సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తిరుమలలో.. గీతూ రాయల్ రీల్స్! టీటీడీ సీరియ‌స్‌

ABN, Publish Date - Mar 01 , 2026 | 08:43 AM

టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా బిగ్ బాస్ ఫేం గీతూ రాయల్ స్నేహితులతో కలిసి సినిమా పాటకు రీల్స్ చేయడం విమర్శలకు దారి తీసింది.

tirumala

టీటీడీ (TTD) నిబంధనలకు విరుద్ధంగా బిగ్ బాస్ ఫేం గీతూ రాయల్ (Geethu Royals) స్నేహితులతో కలిసి సినిమా పాటకు రీల్స్ చేయడం విమర్శలకు దారితీసింది. సాధారణంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తిరుమల (Tirumala) లో రీల్స్, షార్ట్స్ వంటివి చేయడంపై నిషేధం ఉంది. గతంలోనే ఇలా నిబంధనలను అతిక్రమించి వీడియోలు తీసిన వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. తిరుమలలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని టీటీడీ పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు మాత్రం ఫాలోవర్లు, లైకుల కోసం ఇష్టానుసారం రీల్స్ చేస్తూనే ఉన్నారు.

తాజాగా.. గీతూ రాయల్ మరో నలుగురు యువకులతో కలిసి శ్రీవారి ఆలయం, లడ్డూ కౌంటర్‌కు వెళ్లే మార్గంతో పాటు ఘాట్ రోడ్లలోనూ సినిమా పాటకు వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. ఈ అంశంపై టీటీడీ కూడా సీరియస్ అయింది. నిబంధనలను అతిక్రమించిన గీతూ రాయల్ బృందంపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

కాగా.. ఈ వ్యవహారంపై గీతూ రాయల్ ఓ వీడియో ద్వారా స్పందిస్తూ 'అందరికీ గుడ్ న్యూస్. నాపై చర్యలు తీసుకుంటారట. అందరు హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్దగా చేసి వీడియోలు చేసినందుకు థ్యాంక్యూ సో మచ్. అల్రెడీ సగం జీవితం పోయింది. ఇంక పోవడానికి కూడా ఏం లేదు. మిగిలున్నదాన్ని కూడా మీరు పొగొట్టండి. ప్రశాంతంగా ఉండండి' అని పేర్కొన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 08:43 AM