సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రభాస్ డ్రీమ్ మ్యాన్షన్ పనులు మొదలు.. ఎక్కడో తెలుసా

ABN, Publish Date - May 24 , 2026 | 09:52 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) క్రేజ్ బాక్సాఫీస్ వద్దే కాదు, రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోనూ అదే రేంజ్‌లో ఉంది. వరుస పాన్-ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతున్న ప్రభాస్..

Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) క్రేజ్ బాక్సాఫీస్ వద్దే కాదు, రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోనూ అదే రేంజ్‌లో ఉంది. వరుస పాన్-ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతున్న ప్రభాస్.. తాజాగా హైదరాబాద్‌లోని అత్యంత కాస్ట్‌లీ ఏరియాలో తన డ్రీమ్ హౌస్ నిర్మించుకుంటున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వార్త ఎప్పటినుంచో వినిపిస్తున్నా అందులో నిజమెంత అనేదానిపై ఒక క్లారిటీ లేదు.


తాజాగా ప్రభాస్ డ్రీమ్ మ్యాన్షన్ గురించిన ఇంకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. డార్లింగ్ తన కలల సౌధాన్ని నిర్మించే పనిలో పడ్డారట. అవును.. హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ హబ్ అయిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో ఈ లగ్జరీ మ్యాన్షన్ నిర్మించే పనులు మొదలు అయ్యాయని తెలుస్తోంది. అప్పుడెప్పుడో ప్రభాస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఏరియాలో రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఏరియాలో ఒక ఎకరం రూ. 80 కోట్లు.. అంటే దాదాపు రూ. 160 కోట్లు పెట్టి రెండు ఎకరాలను ప్రభాస్ కొనుగోలు చేశారు.


నిజానికి ప్రభాస్ ఈ ల్యాండ్‌ను రెండు సంవత్సరాల క్రితమే ఒక పక్కా ప్లానింగ్‌తో కొనుగోలు చేశారని, స్థలం రిజిస్ట్రేషన్ మరియు అన్ని అనుమతులు లభించడంతో, ఇటీవలే అక్కడ తన డ్రీమ్ హౌస్ నిర్మాణ పనులను మొదలుపెట్టారని సమాచారం. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ కు సరిగ్గా ఆనుకుని ఈ స్థలం ఉండటం వల్ల, ఇక్కడి నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ వంటి ఏ ఏరియాకైనా చాలా సులభంగా, తక్కువ సమయంలో చేరుకోవచ్చు. అందుకే డార్లింగ్ అక్కడే తన మ్యాన్షన్ ని నిర్మించుకుంటున్నారని టాక్ నడుస్తోంది.


ఇక ఈ మ్యాన్షన్ లో అన్ని రకాల సదుపాయాలు ఉండనున్నాయని సమాచారం. ఈ రెండు ఎకరాల విస్తీర్ణంలో ప్రభాస్ ఒక అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్‌ను ప్లాన్ చేశారు. ఇందులో అత్యాధునిక జిమ్, హోమ్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్‌తో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో కూడిన ఇంటీరియర్స్ ఉండబోతున్నాయట. ఈ ఇల్లు మొత్తం పూర్తికావడానికి రెండేళ్ళు పడుతుందని అంటున్నారు. ఏదిఏమైనా పాన్ ఇండియా స్టార్ కి ఈ రేంజ్ మ్యాన్షన్ ఉండడంలో తప్పులేదని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

Updated Date - May 24 , 2026 | 10:09 PM