RC17 Update: చరణ్, సుక్కు సినిమా మొదలయ్యేది అప్పుడేనా..
ABN, Publish Date - Jul 18 , 2026 | 02:16 PM
టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకటైన న్యూ ఏజ్ మెగాస్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ల క్రేజీ ప్రాజెక్ట్ ‘RC17’పై ఇండస్ట్రీ వర్గాల్లో సరికొత్త అప్డేడ్ చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకటైన న్యూ ఏజ్ మెగాస్టార్ రామ్ చరణ్ (New Age Megastar Ram Charan), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar)ల క్రేజీ ప్రాజెక్ట్ ‘RC17’పై ఇండస్ట్రీ వర్గాల్లో సరికొత్త అప్డేడ్ చక్కర్లు కొడుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ (Rangasthalam) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి, ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్‌గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఆ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మళ్లీ చాలా కాలానికి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కానుండటంతో.. సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను ప్రారంభిస్తారా? అని అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.
ఇక తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్‌ను పూర్తిగా లాక్ చేసేశారట. ఈ భారీ యాక్షన్ డ్రామాను ఎంతో గ్రాండ్‌గా పట్టాలెక్కించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాను అధికారికంగా సెప్టెంబర్ నెలలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారనేలా టాక్ మొదలైంది. ఆ తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని, నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది.
‘రంగస్థలం’ వంటి మ్యాజికల్ వండర్ తర్వాత చరణ్-సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పించేలా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి:
నాట్ ఈజీ.. కానీ, రోజూ ఒక గంటసేపు చేయండి: అనసూయ
KJQ: ‘కింగ్ జాకీ క్వీన్’ రిలీజ్ ఖరారు.. ఎప్పుడంటే
చిరుకి వదినగా చేసినా.. నాగ్ ఫ్యామిలీతోనే బాండింగ్ ఎక్కువ: సుధ