సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మాది అఫీషియల్.. ఎన్టీఆర్‌కే షాకిచ్చిన రాఎన్టీఆర్‌!

ABN, Publish Date - Jul 14 , 2026 | 09:43 PM

యంగ్ టైగర్ యన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఎన్టీఆర్ కార్యాల‌యం ఓ లెట‌ర్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

RAW NTR,

యంగ్ టైగర్ యన్టీఆర్ (Jr NTR) జూలై 18న రాజకీయ ప్రవేశం అంటూ వచ్చిన, వ‌స్తున్న‌ వార్తలను యన్టీఆర్ ఫ్యాన్స్ ఖండించ‌గా తాజాగా మంగ‌ళ‌వారం ఎన్టీఆర్ కార్యాల‌యం పేరుతో ఓ లెట‌ర్ రిలీజ్ చేశారు. అందులో ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని 'RAW NTR' సంస్థకు ఎన్టీఆర్‌కు సంబంధం లేద‌ని అధికారికంగా స్ప‌ష్టం చేశారు.

అయితే.. తాజాగా 'RAW NTR' సంస్థ ఫౌండ‌ర్ సాయి రూప్ (Sai Roop) ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. RAW NTR సంస్థ‌ ఆరు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తోందని.. మాది అఫీషియల్ సంస్థ‌, మాకు వెబ్ సైట్ ఉంది, గుర్తింపు ఉంది 40 వేల మంది వలంటీర్స్ సైతం ఉన్నారంటూ తెలిపారు. అస‌లు ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వ‌చ్చిన‌ లేఖకే ఎలాంటి అథెంటెసిటి లేదని, అసలు ఆ లేటర్ గురించి ఎన్టీఆర్‌కే తెలిసుండదని అన్నారు. ఎన్టీఆర్ నేరుగా ఇవ‌న్నీ వద్దు ఆపేయమంటే అన్నీ ఆపేస్తామ‌ని అన్నారు.

నేను వైసీపీ పార్టీ అని, పేటీఎం గాడిని అని అంటున్నారని కానీ నేను TDP పార్టీ సభ్యుడిని అని ఎన్టీఆర్ అభిమానుల్లో అందరు ఉంటారని Rawntr సేవాతత్వంతో ఏర్పాటైన ఆర్గనైజేషన్.. రాజకీయాలకు సంబంధం‌ లేదని స్ప‌ష్టం చేశారు. నన్ను విమర్శించే అభిమాన సంఘ నాయకులే ఏ సేవ చేయలేదు.. నన్ను బెదిరించారు తిట్టారని అన్నారు. ABN లాంటి పెద్ద ఛానెల్ ఎదుట‌ నేను అబద్దాలు ఎందుకు చెబుతానని అన్నారు. ఒక్కసారిఎన్టీఆర్‌ గారిని కలిసే అవకాశం ఇస్తే మా కష్టాన్ని వారికి వివరిస్తాం అన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 09:57 PM